స్టార్ డైరెక్టర్‌పై కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. సినీ ఇండస్ట్రీలో దుమారం

ఇండియన్ సినిమా వెండితెర డైరెక్టర్స్ అందరిలో శంకర్ కి ప్రత్యేక స్థానముంది. ఆయన దర్శకతంలో వచ్చిన భారతీయుడు, ఒకే ఒక్కడు, బాయ్స్, రోబో లాంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేశాయి. కాగా ఇటీవలే రోబో 2 సినిమా ద్వారా కాస్త నిరాశ చెందిన డైరెక్టర్ శంకర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు కమెడియన్ వడివేలు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో శంకర్ గురించి వడివేలు మాట్లాడిన మాటలు సెన్సేషన్ అవుతున్నాయి. వివారాల్లోకిపోతే..

కొన్ని రోజులుగా వడివేలు సెన్సేషన్

కొన్ని రోజులుగా వడివేలు సెన్సేషన్

ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని సైతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో వెనక్కి నెట్టి # Pray for nesamani హ్యాష్ ట్యాగ్‌తో వార్తల్లో నిలిచాడు టాప్ కమెడియన్ వడివేలు. చాలా కాలంగా కెమెరాకు దూరంగా ఉన్న ఆయన దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఫ్రెండ్స్' చిత్రంతో నేసమని అనే పాత్ర చేయగా అందులో తలపై సుత్తి పడటంతో తలకు బలమైన గాయమవుతుంది. ఆ సన్నివేశంతో ఉన్న ఫోటో ఒకటి గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతుండటంతో నెట్టింట వడివేలు సెన్సేషన్ అయ్యాడు.

వడివేలు ఇంటర్వ్యూలు

వడివేలు ఇంటర్వ్యూలు

నెట్టింట వడివేలు సెన్సేషన్ చూసిన మీడియా వర్గాలు ఆయనను వరుసపెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా టాప్ డైరెక్టర్ శంకర్ పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ రకంగా శంక‌ర్‌, వ‌డివేలు మ‌ధ్య విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి.

శంక‌ర్ సినిమాల్లో వడివేలు పాత్రలు.. ఆ తర్వాత విభేదాలు

శంక‌ర్ సినిమాల్లో వడివేలు పాత్రలు.. ఆ తర్వాత విభేదాలు

శంక‌ర్ రూపొందించిన ప‌లు సినిమాల్లో వ‌డివేలు కీల‌క పాత్ర‌లు పోషించాడు. వ‌డివేలు హీరోగా రూపొందిన `హింసించే 23వ పులికేసి` సినిమాను శంక‌ర్ నిర్మించాడు. ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య విభేదాలు త‌లెత్తిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శంక‌ర్‌పై ఆయన విమ‌ర్శ‌లు కురిపించడంతో ఆ వార్తలు నిజమే అని తేలింది.

ద‌ర్శ‌కుడిగా ఏదో అలా నెట్టుకొస్తున్నాడు

ద‌ర్శ‌కుడిగా ఏదో అలా నెట్టుకొస్తున్నాడు


కెరీర్ ప్రారంభం నుంచి గ్రాఫిక్ స‌న్నివేశాల‌తోనే శంకర్ ద‌ర్శ‌కుడిగా నెట్టుకొస్తున్నాడని వడివేలు పేర్కొన్నాడు. శంకర్ కేవ‌లం ఓ గ్రాఫిక్స్ డైరెక్ట‌ర్ మాత్ర‌మే అని, అంత‌కు మించి శంకర్ లో విషయమే లేదని వడివేలు చెప్పడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో.. ఓ టాప్ డైరెక్టర్ ని పట్టుకొని ఈ మాటలు మాట్లాడం ఏంటనే చర్చలు ఊపందుకున్నాయి.

23వ పులికేసి సినిమాపై కూడా

23వ పులికేసి సినిమాపై కూడా

శంకర్ పైనే కాదు.. `23వ పులికేసి` డైరెక్ట‌ర్‌ శింబుదేవ‌న్‌ పై కూడా వడివేలు విమర్శలు గుప్పించాడు. అస‌లు శింబుదేవ‌న్‌‌కి ద‌ర్శ‌క‌త్వ‌మే రాదు, 23వ పులికేసి సినిమాలో చాలా సీన్ల‌కు నేనే ద‌ర్శ‌క‌త్వం వ‌హించా. స్క్రిప్ట్ రైటింగ్ కూడా చేశా. శింబుదేవ‌న్‌ సింగిల్ లైన్‌తోనే నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. మిగిలిన క‌థంతా నేనే డెవ‌ల‌ప్ చేశా అని వ‌డివేలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

More from Filmibeat

Read more about: vadivelu comments shankar kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X