'చిరుత' ఫేమ్ రామ్ చరణ్ తేజాని సీనియర్ డైరక్టర్ ఎ.కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్ దర్శకత్వం చేస్తానంటున్నాడు. వైభవ్ తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన 'గొడవ' అనే సినిమా ద్వారా వైభవ్ హీరోగా పరిచయమయ్యాడు. అతనికి మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చ అభిమానంట. తన తండ్రి చిరంజీవితో సినిమాలు రూపొందించినప్పుడు లొకేషన్స్ కి వెళ్ళి పరిశీలించేవాడట. అదే అతను నటుడు కావటానికి ప్రేరణట. అలాగే ఈ తరంలో రామ్ చరణ్ తేజా అంటే ఇష్టమట. అందుకే అతన్ని డైరక్ట్ చేయాలని కోరికట. ప్రస్తుతం రామ్ చరణ్ తేజా యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో గర్జించటానికి రెడీ అవుతున్నాడు. వైభవ్ తమిళ, తెలుగు భాషల్లో తయారవుతున్న సినిమాలో హీరోగా చేస్తున్నాడు. తండ్రి ఎ.కోదండరామిరెడ్డి అప్పట్లో 'ఖైదీ' వంటి మెగాహిట్లు చాలా ఇచ్చారు. మరి ఈ తరం యువ కెరటాలు రామ్ చరణ్ తేజా, వైభవ్ కలిసి ఇప్పడు ఏ సంచలనం సృష్టిస్తారో చూడాలి.
Story first published: Friday, July 17, 2026, 2:43 [IST]