సరదా కోసమే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు
ఇందులో పవన్ కల్యాణ్, మహేష్ బాబు అనే పేర్లు సరదా కోసమే ఉపయోగించాం. మరే ఉద్దేశం లేదు. అంటూ తన లేటెస్ట్ చిత్రం 'కాస్కో' గురించి నిర్మాత ఎ.కోదండరామిరెడ్డి చెప్తున్నారు. ఆయన కుమారుడు వైభవ్ హీరోగా చేసిన 'కాస్కో' చిత్రం ఈ రోజు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్బంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ..మా 'కాస్కో' సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా మాస్‌ని అలరించేలా సాగుతుంది. వైభవ్ నటనకు మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. అలాగే ఈ చిత్రం స్టోరీ లైన్ చెబుతూ..పవన్ కల్యాణ్ అలియాస్ వంశీ (వైభవ్) ఉద్యోగం వెదుక్కొంటూ హైదరాబాద్ వస్తాడు. అతనికి మహేష్ బాబు (బ్రహ్మానందం) పరిచయమవుతాడు. ఆ క్రమంలో వంశీకి రేడియో మిర్చిలో పని చేసే శ్వేతతో స్నేహం మొదలై అది ప్రేమగా మారుతుంది. అక్కణ్నుంచి కథ మలుపు తిరుగుతుంది అంటున్నారు. ఇక గతంలో సిక్స్ టీన్స్,గుడ్ బోయ్, సీమశాస్త్రీ, గర్ల్ ప్రెండ్ వంటి కామిడీ చిత్రాలు డైరక్ట్ చేసిన నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. హీరోయిన్ గా కొత్తబంగారు లోకంతో యువతను ఆకట్టుకున్న శ్వేతాబసు చేసింది. వైభవ్ ఇంతకు ముందు గొడవ, సరోజ చిత్రాల్లో హీరోగా చేసారు. ఇక ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. వాటిని రీచవుతుందో లేదో ఈ రోజు చూడాలి.


Click it and Unblock the Notifications











