Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వైభవ్, శ్వేతాబసు 'కాస్కో' చిత్రం ఏమైంది?
వైభవ్, శ్వేతాబసు కాంబినేషన్ లో హాస్య చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి రూపొందించిన కాస్కో చిత్రం భాక్సాఫీస్ వద్ద కష్టమని తేలింది. ఇన్నాళ్ళూ కామిడీ బాటన వెళ్ళిన నాగేశ్వరరెడ్డి హఠాత్తుగా యాక్షన్ బాట పట్టి అటు, ఇటు కాని చిత్రంగా కాస్కో ని మార్చేసాడని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ వంశీ ఉరఫ్ పవన్‌కళ్యాణ్(వైభవ్) కిడ్నాప్ అయిన ప్రియురాలు కృష్ణవేణి(శ్వేతాబసుప్రసాద్)ని వెతుక్కుంటూ హైదరాబాద్ రావటంతో మొదలవుతుంది. అక్కడ మహేష్ బాబు (బ్రహ్మానందం)తో పరిచయం ఏర్పడుతుంది. మహేష్‌బాబు అప్పటికే సిటీలో ఉన్న రౌడీయిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకొని ఉంటాడు. అతని ప్రయత్నానికి పవన్‌కళ్యాణ్ కూడా అండగా నిలుస్తాడు. ఇద్దరు కలిసి రౌడీయిజంపై పోరాటం సాగిస్త్తుంటారు. ఇక ఈ రౌడీయిజం నిర్మూలనకీ పవన్‌కళ్యాణ్‌కీ ఒక ఫ్లాష్ బ్యాక్ లింక్ ఉంటుంది.
అదేమిటంటే తన ప్రియురాలు కృష్ణవేణిని సిటీలోని పెద్ద గూండా (ప్రదీప్ రావత్) కిడ్నాప్‌చేసి ఉంటాడు.అదెంకుటంటే కృష్ణవేణిని ఆ గూండా కొడుకు ప్రేమించి అనుకోని పరిస్దితుల్లో మరణిస్తాడు. దాంతో ఎవరి వల్ల అయితే తాను కుమారుడుని కోల్పోయాడో..ఆమె ద్వారానే తాను బిడ్డను కనాలని ఈ కిడ్నాప్ చేస్తాడు. ఆ పరిస్దితుల్లో ఆ గూండా బారి నుంచి కృష్ణవేణిని ఎలా మన హీరో కాపాడాడు అన్నదే మిగతా కథ. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన శ్వేతాబసు తన భారీ కాయంతో చాలా ఇబ్బంది పెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తమ్ముడి కుమారుడైన ప్రేమ్‌జీ అమరన్ అందించిన సంగీతం పెద్ద వర్కవుట్ కాలేదు. ఇక వైభవ్ కు గొడవ, సరోజ చిత్రాల తర్వాత వచ్చిన ఈ కాస్కో చిత్రం కూడా పెద్దగా కెరీర్ ని ముందుకు తీసుకెళ్ళదు.