'కాస్కో' విజయోత్సాహం
ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ కథానాయకుడుగా 'కొత్త బంగారు లోకం" ద్వారా పరిచయమైన శ్వేతా బసుప్రసాద్, గౌరి పండిట్‌లు హీరోయిన్లుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కె.ఫిలిమ్స్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి నిర్మించిన 'కాస్కో" చిత్రం ఇటీవలె విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా ఫిలించాంబర్‌లో విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ''సినిమా చూసిన వారంతా చాలా బాగుంది. వైభవ్ బాగా చేసాడు అంటున్నారు. ప్రేక్షకులకు నా ధన్యవాదాలు"" అన్నారు. వైభవ్ మాట్లాడుతూ ''సినిమాలో పాటలు, ఫైట్లు చాలా బాగున్నాయని అంతా అంటున్నారు. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు"" అన్నారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ''విజయవంతంగా మూడో వారం ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు"" అన్నారు.


Click it and Unblock the Notifications











