వైభవ్ హీరోగా 'సుబ్రహ్మణ్యపురం'దర్శకుడి తెలుగు చిత్రం
కలర్స్ స్వాతి నటించిన అనంతపురం (తమిళ్ లో 'సుబ్రహ్మణ్యపురం)దర్శకుడు శశికుమార్ తమిళంలో రూపొందించిన ఈసన్ అనే చిత్రం తెలుగులో 'జ్వాల'టైటిల్ తో డబ్బింగ్ అవుతోంది.గొడవ చిత్రంతో పరచయమైన వైభవ్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు.ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కె.వి.ఫిల్మ్ పతాకంపై కె.వేణుగోపాల్ అందిస్తున్నారు.ఈ చిత్రం గురించి నిర్మాత కె.వేణగోపాల్ చెబుతూ ఉన్నతమైన చదవును అభ్యసించడానికై పట్నం వచ్చిన ఓ కుర్రాడు సిటీలోని కుర్రకారు చేస్తున్న చిలిపి పనులకు అలవాటుపడిపోతాడు.
ఈ చిలిపి పనులను అతను ఏ 'విధంగా వదిలించుకొని సరైన దారిలోకి తన జీవితాన్ని ఎలా మార్చుకుంటాడనేదే 'జ్వాల' అన్నారు. అలాగే విలన్ పాత్రే హీరో అయితే ఏ విధంగా వుంటుందనేదే ఈ చిత్రమని వివరించారు. ఈ మార్చి మాసంలో దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని జరిపి డబ్బింగ్‌ని స్టార్ట్ చేస్తాము అని తెలిపారు.
వైభవ్ సరసన అభినయ (శంభో శివ శంభో ఫేమ్) నాయికగా నటించిన ఈ చిత్రంలో సముద్రఘని, తులసి, సన, రావురమేష్, అపర్ల బాజ్‌పారు ప్రధాన పాత్రల్ని పోషించారు.ఈచిత్రానికి సంగీతం : జేమ్స్ వసంతన్, మాటలు, పాటలు : గోపి, ఛాయాగ్రహణం : ఎస్.కె.కధిర్, ఎడిటింగ్ : నందమూరి హరి ముఖ్యసాంకేతిక వర్గం. నిర్మాత : కె.వేణుగోపాల్ , కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ఎం.శశికుమార్.


Click it and Unblock the Notifications











