ఉప్పెన క్లైమాక్స్ పై జోకులు.. సినిమా చూస్తే అలా కామెంట్స్ చేయలేరు: వైష్ణవ్ తేజ్
మొదటి సినిమా అనేది హీరోలకు ఎంత ముఖ్యమో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అగ్ర హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలైతే వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మెగా హీరో వైష్ణవ్ తేజ్ మాత్రం మొదటి సినిమానే ఎవరు ఊహించని విధంగా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాపై ఓ వర్గం ఆడియేన్స్ లో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇక క్లైమాక్స్ సీన్ పై వస్తున్న కామెంట్స్ పై వైష్ణవ్ తేజ్ స్పందించాడు.

ఆ ట్విస్ట్ తేడా కొడితే..
అయితే సినిమాలో ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా మూడ్ ను మొత్తం ఒక్కసారిగా చేంజ్ చేసే ఆ ట్విస్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా కూడా చాలా కష్టమని రూమర్స్ కూడా వస్తున్నాయి. విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా
ఓ వర్గం ఆడియెన్స్ అయితే విజయ్ సేతుపతి క్యారెక్టర్ కోసమే సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్రైలర్ లో అతని పాత్ర పవర్ఫుల్ గా ఉండడం వలన సినిమాపై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయగలదని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ పై చాలా రోజులుగా ఒక రూమర్ హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

హీరోకు కలిగించే నష్టం..
విలన్ కూతురిని హీరో ప్రేమించడం ఆ తరువాత.. విలన్ హీరోను టార్గెట్ చేయడం అనేది రొటీన్ ఫార్ములా అయినప్పటికీ హిరోకు విలన్ కలిగించే నష్టం ఊహించని విధంగా ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి. చరిత్రలో ప్రేమ నిలిచిపోవాలి అంటే హ్యాపీగా ఉండకూడదు. పిల్లల్ని కని హ్యాపీగా ఉంటే ప్రేమ విలువ తగ్గిపోతుంది అనే డైలాగ్ లోనే కథ అర్ధమవుతోంది. హీరోకు విలన్ ఊహించని నష్టం కలిగిస్తాడని టాక్ వచ్చింది.

జోకులు వేస్తున్నారు..
ఇప్పటివరకు అలాంటి ట్విస్ట్ తెలుగు సినిమాల్లోనే ఎవరు చూసి ఉండరని రూమర్స్ వస్తున్నాయి. సినిమా కథను ఓకే చేయడానికి కారణం కూడా అదేనట. దర్శకుడు సుకుమార్ ఆధ్వర్యంలో వచ్చిన స్క్రిప్ట్ కాబట్టి ట్విస్ట్ బలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఓ వర్గం వారు ఆ విషయంపై జోకులు వేసుకోవడం సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్ చేయడంపై వైష్ణవ్ తేజ్ స్పందించాడు.

టైటిల్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్
వైష్ణవ్ మాట్లాడుతూ.. ఒక విధంగా కొందరు క్లైమాక్స్ సీన్ ను తప్పుగా అనుకుంటున్నారు. నిజంగా అది ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. సినిమా చూసిన తరువాత కథ అసలు అంతరార్థం తెలుస్తుంది. ఈ విధంగా జోకులు వేయలేరు. ఉప్పెన అనే టైటిల్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. క్లైమాక్స్ సీన్ మాత్రం హార్ట్ ను టచ్ చేసే విధంగా చాలా ఎమోషనల్ గా ఉంటుందని వైష్ణవ్ తేజ్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











