సాయిధరమ్ తేజ్ తమ్ముడి ఎంట్రీకి ముహూర్తం ఖరారు!
మెగా ఫ్యామిలీ నుంచి మరో నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు వైష్ణవ్ తొలి చిత్రానికి ముహూర్తం కుదిరింది. దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మించబోతున్న చిత్రం జనవరి 21న అంటే రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతోంది.
సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు అనే వ్యక్తి ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నాడట. ఇక వైష్ణవ్ డెబ్యూ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండడం విశేషం. విశ్వరూపం 2 చిత్రానికి పనిచేసిన శ్యామ్ దత్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. రంగస్థలం చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్స్ దంపతులు రామకృష్ణ, మౌనిక ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు.

వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ లాంచింగ్ కు ముఖ్య అతిధిగా ఎవరొస్తారనే విషయంలో క్లారిటీ రాలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైష్ణవ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











