రీతూ వర్మతో మెగా హీరో డేటింగ్.. అందుకే వరుణ్ తేజ్ పార్టీలో అలా: క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్
సాధారణంగా సినీ రంగంలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉన్నా లేకున్నా హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఇలా ఇప్పటికే టాలీవుడ్‌లోని ఎంతో మంది మధ్యన డేటింగ్ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు హీరోయిన్ రీతూ వర్మ, మెగా హీరో వైష్ణవ్ తేజ్ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ వ్యవహారంపై ఈ మెగా హీరోనే స్వయంగా స్పందించాడు. అసలు ఈ టాక్ రావడానికి కారణం అయిన పార్టీ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

వరుణ్ పార్టీలో రీతూ వర్మ: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలే తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి ముందు వీళ్ల ఫ్యామిలీ మొత్తం పలుమార్లు బ్యాచ్‌లర్ పార్టీలు చేసుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ కాబోయే జంటకు పార్టీ ఇచ్చాడు. దీనికి తెలుగు హీరోయిన్ రీతూ వర్మ కూడా హాజరైంది. దీంతో ఇది అప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

వైష్ణవ్‌తో పిక్ ఫుల్ వైరల్: వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీకి రీతూ వర్మ హాజరై తెగ సందడి చేసింది. అంతేకాదు, ఆమె మెగా హీరోలతో ఫొటోలు కూడా తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముఖ్యంగా 'ఉప్పెన' హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో రీతూ వర్మ తీసుకున్న ఫొటో మాత్రం బాగా వైరల్ అయిందన్న విషయం తెలిసిందే.

ఇద్దరి మధ్యన లవ్ ట్రాక్: పంజా వైష్ణవ్ తేజ్ - రీతూ వర్మ కలిసి తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయినప్పటి నుంచి వీళ్లిద్దరి గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేశాయి. ముఖ్యంగా ఈ హీరో, హీరోయిన్లు డేటింగ్‌లో ఉన్నారని టాక్ వినిపించింది. అంతేకాదు, వైష్ణవ్ తేజ్ కోరిక మేరకే రీతూ వర్మ ఈ పార్టీకి హాజరైందని కూడా ప్రచారం జరిగింది. దీంతో టాలీవుడ్‌లో ఇది చర్చనీయాంశం అయింది.

క్లారిటీ ఇచ్చిన మెగా హీరో: రీతూ వర్మ - వైష్ణవ్ తేజ్ లవ్ ట్రాక్ వార్తలు వైరల్ అవడంతో టాలీవుడ్‌లో కొత్త జంట వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై మెగా హీరో వైష్ణవ్ తేజ్ స్పందించాడు. తాజాగా తన కొత్త సినిమా 'ఆదికేశవ' ప్రమోషన్స్‌లో పాల్గొన్న అతడు.. రీతూ వర్మను ప్రేమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అన్నాడు.
అందుకే వచ్చిందంటూ: ఇదే ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. 'రీతూ వర్మ అండ్ లావణ్య త్రిపాఠి క్లోజ్ ఫ్రెండ్. ఆమె పిలవబట్టే తను ఆ పార్టీకి వచ్చింది. అంతకు మించి దీని వెనుక ఏమీ లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. తద్వారా రీతూ వర్మతో తనకు అందరూ అనుకునే లాంటి రిలేషన్ అయితే లేదని స్పష్టం చేశాడు. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడుతుందా లేదా చూడాలి.

వైష్ణవ్ అలా.. రీతూ ఇలా: వైష్ణవ్ తేజ్ ఇప్పుడు 'ఆదికేశవ' అనే సినిమాను చేశాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు, రీతూ వర్మ ఇటీవలే 'మార్క్ ఆంటోని' అనే చిత్రంతో వచ్చి సక్సెస్ సొంతం చేసుకుంది. ఇప్పుడామె విక్రమ్‌తో 'ధృవ నక్షత్రం' మూవీ చేసింది. ఇది కూడా నవంబర్ 24వ తేదీనే విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











