For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మిస్ అవడమే మైనస్

  |

  టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఎంతటి ప్రత్యేకమైన గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే. సుదీర్ఘ కాలంగా ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ మధ్యనే మరో హీరో కూడా వచ్చాడు. అతడే చిరంజీవి చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. ఇప్పటికే పలు చిత్రాలను చేసిన ఈ కుర్రాడు.. ఇప్పుడు 'రంగరంగ వైభవంగా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వచ్చింది? ట్విట్టర్‌లో ఈ మూవీపై ఎలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి? అనే వివరాలు మీ అందరి కోసం!

  రంగరంగ వైభవంగా వచ్చేశాడు

  రంగరంగ వైభవంగా వచ్చేశాడు

  పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'రంగరంగ వైభవంగా'. గిరీశయ్య అనే డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు.

  ఆ సీరియల్ నటితో ప్రేమలో పడ్డ హైపర్ ఆది: ఆ షోలో బయటపెట్టిన కమెడియన్

  అలాంటి స్టోరీతో వచ్చిన మూవీ

  అలాంటి స్టోరీతో వచ్చిన మూవీ

  ఇప్పటికే తనదైన చిత్రాలతో ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకున్న పంజా వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు 'రంగరంగ వైభవంగా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం లవ్ స్టోరీకి సంక్లిష్టమైన పాయింట్‌ను జోడించి తెరకెక్కించారని తెలిసింది. ఇది ఆద్యంతం లవ్ అండ్ ఎమోషనల్‌ సీన్స్‌తో సాగేలా తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.

  అంచనాలు తగ్గట్లుగా బిజినెస్

  అంచనాలు తగ్గట్లుగా బిజినెస్

  పూర్తి స్థాయి ప్రేమకథతో వినోదాత్మకంగా తెరకెక్కించిన 'రంగరంగ వైభవంగా' సినిమా ప్రమోషన్ సరికొత్తగా సాగింది. అందుకే దీని నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ జరిగింది. అంతేకాదు, ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

  ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!

  వైష్ణవ్ మూవీకి ఊహించని టాక్

  వైష్ణవ్ మూవీకి ఊహించని టాక్

  వైష్ణవ్ తేజ్ - కేతిక శర్మ జంటగా నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీ ప్యూర్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఎక్కువ మంది ఈ సినిమా ఏవరేజ్‌గా ఉందని ట్వీట్లు చేస్తున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా

  'రంగరంగ వైభవంగా' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌ను చూపిస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారట. అయితే, ఇంటర్వెల్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుందట. కానీ, సెకెండాఫ్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని అంటున్నారు. ఇక, క్లైమాక్స్ మాత్రం తేలిపోయేలా ఉంటుందని సమాచారం.

  శృతి మించిన సీరియల్ నటి హాట్ షో: ఇలాంటి ఫొటోలు ఎప్పుడూ చూసుండరు!

  సినిమా ప్లస్‌లు.. మైనస్‌ ఇలా

  సినిమా ప్లస్‌లు.. మైనస్‌ ఇలా

  'రంగరంగ వైభవంగా' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, పాటలు, విజువల్స్, సత్య కామెడీ సీన్స్ మాత్రమే ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే, దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్ పండకపోవడం, సెకెండాఫ్, తేలిపోయిన క్లైమాక్స్ ఈ చిత్రానికి మైనస్‌గా మారాయని సినిమాను చూసిన వాళ్లు ట్వీట్లు చేస్తున్నారు.

  మొత్తంగా మూవీ ఎలా ఉంది

  మొత్తంగా మూవీ ఎలా ఉంది

  ట్విట్టర్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'రంగరంగ వైభవంగా' మూవీ గతంలో చూసిన చాలా సినిమాలను గుర్తు చేసేలా ఉంటుందట. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు కాపీ కొట్టినట్లు అనిపిస్తాయట. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఏమాత్రం కొత్తగా ఉండదని తెలిసింది. మొత్తంగా ఈ సినిమా వైష్ణవ్ తేజ్ అభిమానులకు మాత్రమే నచ్చే అవకాశం ఉందని టాక్.

  అషు రెడ్డి అందాల ప్రదర్శన: ఏకంగా షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

  అసలైందే మిస్ అయిందట

  అసలైందే మిస్ అయిందట


  'రంగరంగ వైభవంగా' మూవీని చూసిన వాళ్లు చెబుతున్న దాని ప్రకారం.. ఈ సినిమాను ప్యూర్ లవ్ స్టోరీ ప్రధానంగా తెరకెక్కించారు. కానీ, అదే ఈ సినిమాలో మిస్ అయిందని సినిమాను చూసిన వాళ్లు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రేమకథా నేపథ్యం తాలూకు సోల్ ఈ సినిమాలో కనిపించదట. అదే దీనికి మైనస్‌గా మారడంతో సినిమా చాలా మందికి రీచ్ అయ్యేలా లేదని తెలిసింది.

  English summary
  Vaishnav Tej Did Ranga Ranga Vaibhavanga Movie Under Gireeshaaya Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X