Uppena Teaser.. మొత్తానికి కథ రివీల్ అయిందిగా.. క్లైమాక్స్ విషాదాంతమే!!

సంక్రాంతి సంబరాలు అంటే ఇండస్ట్రీలోనే అసలు పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగే సినిమాలు కొన్ని అయితే.. అప్డేట్లతో టీజర్, ట్రైలర్‌లు రిలీజ్ చేస్తూ మరి కొన్ని చిత్రాలు సందడిచేస్తుంటారు. అలా తాజాగా ఉప్పెన టీజర్‌తో పెద్ద సునామినే పట్టుకొచ్చేశారు. నిమిషం పొడవున్న ఈ టీజర్ ఎన్నో అనుమానాలు, కొండంత ఆసక్తిని అందరికి కలిగించింది.

మొదటి నుంచి..

మొదటి నుంచి..

ఉప్పెన సినిమాపై మొదటినుంచి అందరికీ పాజిటివ్ ఆలోచనలే ఉన్నాయి. ఇక ఒక్కో పాట విడుదల చేస్తుంటే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందరూ ఆస్వాధించుకుంటూ వెళ్లారు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నా కూడా ఉప్పెనపై అంచనాలు తగ్గలేదు.

సినిమా స్టోరీపై..

సినిమా స్టోరీపై..

ఉప్పెన సినిమా స్టోరీపై మొదటి నుంచి ఓ రూమర్ వస్తూనే ఉంది. మన తెలుగు ప్రేక్షకులు అంతగా ఒప్పుకోనిది.. కోరుకోనిదే జరుగుతుందని చెప్పుకొచ్చారు. క్లైమాక్స్‌లో హీరోనో లేదా హీరోయినో లేదా ఇద్దరూ చనిపోతారని రూమర్లు వచ్చాయి. అలాంటి వాటిపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది.

ఉప్పెన టీజర్ రచ్చ..

ఉప్పెన టీజర్ రచ్చ..

ఇక ఉప్పెన టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులోని విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, ఆ ఫ్రెష్ నెస్ అంతా కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే వైష్ణవ్ తేజ్ మాట్లాడుతుంటే.. ఆ డైలాగ్‌లు వింటుంటే.. రామ్ చరణ్ పలికినట్టు వినిపిస్తోంది. మొత్తంగా ఈ మెగా హీరో మొదటి దెబ్బలోనే ఇంపాక్ట్ చూపేలా కనిపిస్తున్నాడు.

డైలాగ్‌లు వైరల్..

ఉప్పెన టీజర్‌లో డైలాగ్‌లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వీడు ముసలోడు అవ్వకూడదే.. అని హీరోయిన్ చెప్పే డైలాడ్.. నేను పుట్టినప్పుడే ఎవరి కోసం పుట్టానో కూడా చెప్పేశాడు.. అని హీరో చెప్పే మాటలు బాగానే క్లిక్ అయ్యేలా ఉన్నాయి. ఇక ఇంకో డైలాగ్ వింటే సినిమా క్లైమాక్స్ ఏంటో అర్థమవుతోంది.

ఈ ఒక్క రాత్రే..

ఈ ఒక్క రాత్రే..

ఈ ఒక్క రాత్రే మనం 80 ఏళ్లు గుర్తుండిపోయేలా గడుపుదాం అంటూ హీరో హీరోయిన్లు అలా సముద్రంలోకి వెళ్లడం,టీజర్ చివర్లో అలా వైష్ణవ్ తేజ్ పడి ఉండటం చూస్తే ఎవరో ఒకరు చనిపోవడమో లేదా ఇద్దరూ చనిపోవడమో జరిగేలా కనిపిస్తోంది. మొత్తానికి ఈ టీజర్ మాత్రం అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X