'అదుర్స్' పాటలపై వైష్ణవుల వివాదం
జూ ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్లో వచ్చిన 'అదుర్స్' చిత్రం రోజుకో రకంగా ఏదో వివాదంలో చిక్కుకుని వార్త అవుతోంది. నిన్నటి వరకూ తెలంగాణ బెదిరింపులు, కాపీ కథ వివాదంతో ఉన్న ఈ చిత్రంలో పాటలు అభ్యంతరం అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అదుర్స్ చిత్రంలో పాటలు వైష్ణవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వున్నాయని వైష్ణవ సేవా సమితి ఆరోపించింది. ఈ మేరకు సేవా సమితి ప్రతినిధులు బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తక్షణమే ఆ పాటలను చిత్రం నుంచి తొలగించి, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని వైష్ణవ సేవా సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. ఈ చిత్రంలో వేరిజ్ పిలక, వేరీజ్ పంచికట్టు..చారి అనే పాటమీదే ఈ వివాదం మొదలైంది.
జూ ఎన్టీఆర్ అదుర్స్ నయనతార షీలా వివి వినాయిక్ వైష్ణవులు తెలంగాణ jr ntr adurs nayantara sheela vv vinayak vishnavas telangana kodali nani


Click it and Unblock the Notifications