Baby మరోసారి ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య.. డైరెక్టర్, నిర్మాతలు ఎవరంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో బేబీ చిత్రం కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్ చేసింది. యువ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ చిత్రానికి సాయిరాజేష్ దర్శకత్వం వహించాడు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఈ చిత్రం దాదాపు 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటకు విశేషమైన క్రేజ్ లభించింది. వైష్ణవీ చైతన్య ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే ఈ ఇద్దరి జంట మరోసారి కలిసి నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా కలర్ ఫోటో రూపొందించిన అమృతా ప్రొడక్షన్స్ , మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు SKN తోపాటు సాయి రాజేష్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకు రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.

వైష్ణవీ చైతన్య నటించే ఈ కొత్త ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకొంటున్నది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూవీని 2024 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
కథ, స్క్రీన్ ప్లే: సాయి రాజేష్
దర్శకత్వం: రవి నంబూరి
సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు: SKN, సాయి రాజేశ్
సినిమాటోగ్రఫి: బాల్ రెడ్డి
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: విప్లవ్


Click it and Unblock the Notifications











