సప్తగిరిని నమ్ముకుంటే.. 200 కుటుంబాలు బతుకుతాయి.. డిస్టిబ్యూటర్ సెన్సేషనల్ కామెంట్

స‌ప్త‌గిరి హీరోగా న‌టించిన సినిమా వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌. వైభ‌వీజోషి నాయిక‌. అర్చ‌న కీల‌క పాత్ర‌లో న‌టించారు. శివ‌శివ‌మ్ ఫిల్మ్స్ నిర్మించింది. న‌రేంద్ర , జి.ఎన్‌.రెడ్డి నిర్మాత‌లు. అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో స‌క్సెస్‌మీట్‌ను నిర్వ‌హించారు.

 భారీ హిట్‌ను ఊహించలేదు

భారీ హిట్‌ను ఊహించలేదు

ఈ సంద‌ర్భంగా నిర్మాత న‌రేంద్ర మాట్లాడుతూ ``చాలా ఆనందంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావ‌డం లేదు. శివ శివ‌మ్ ఫిల్మ్స్ ప‌తాకంపై `వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` అనే సినిమా చేశాం. మాది మాస్ సినిమా. మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది. ఆద‌రిస్తున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ స‌క్సెస్‌కు కార‌ణ‌మైన మీడియా మిత్రుల‌కు ధ‌న్య‌వాదాలు. వాళ్లు లేకుంటే మా బ్యాన‌ర్ ఉండేది కాదు. మా సంస్థ‌ను నిల‌బెట్టినందుకు వారికి ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రంతో సినిమా ఇండ‌స్ట్రీలో మా బ్యాన‌ర్ ఉంద‌ని అంద‌రికీ తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి మేం భారీ హిట్లు ఏమీ ఊహించ‌లేదు. కానీ మా శ్ర‌మ‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం కావాల‌ని మాత్రం కోరుకున్నాం. అది ద‌క్కింది. అంద‌రం తృప్తిగా ఉన్నాం. నిర్మాత‌గా 100 శాతం మేం స‌క్సెస్ అయ్యాం. ప‌రిపూర్ణంగా సేఫ్ అయ్యాం అని చెప్తున్నాం అని అన్నారు.

 హీరో సప్తగిరిని నమ్మకుంటే

హీరో సప్తగిరిని నమ్మకుంటే

స‌ప్త‌గిరిగారు ఎల్ల‌వేళ‌లా మా వెన‌కే ఉండి స‌పోర్ట్ చేశారు. స‌ప్త‌గిరిలాంటి హీరోను న‌మ్ముకుంటే క‌చ్చితంగా 200 కుటుంబాలు బ‌తుకుతాయి. మా సంస్థ‌లో ఏడాదికి రెండు సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. మేం ప‌డ్డ శ్ర‌మ‌కి స‌క్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు, సాంకేతిక నిపుణుల‌కు ధ‌న్య‌వాదాలు. మా సినిమాను కొని మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపించిన బ్ర‌హ్మ‌య్య‌గారికి ధ‌న్య‌వాదాలు. ఆయ‌న కూడా రిలీజ్ చేసి సేఫ్ అయ్యార‌ని తెలిసి చాలా ఆనందంగా ఉన్నాం`` అని అన్నారు.

 ఒక్కొసారి జనాలు లేకపోతే

ఒక్కొసారి జనాలు లేకపోతే

డిస్టిబ్యూటర్ బ్ర‌హ్మ‌య్య మాట్లాడుతూ ``నేను గ‌తంలో 114 సినిమాలు సీడెడ్‌లో రిలీజ్ చేశా. ఏ సినిమాను ఎంత‌కు కొనాలో నాకు తెలుసు. నేను అడిగిన రేటుకు `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌`ను నాకు ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పూర్తిగా నేనే బిజినెస్ చేశాను. వైజాగ్‌, ఈస్ట్, వెస్ట్, కృష్ణ‌, గుంటూరు, నెల్లూరు, నైజామ్‌లో డిస్ట్రిబ్యూట‌ర్లు న‌న్ను న‌మ్మి సినిమా తీసుకున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి కొన్ని థియేట‌ర్ల‌లో జ‌నాలు లేక `హాలు రిపేరులో ఉన్న‌ది` అని బోర్డు పెట్టిన ఉదంతాలు కూడా నాకు తెలుసు. స‌రైన సినిమా లేకపోవ‌డంతో త‌లెత్తిన దారుణ‌మైన ప‌రిస్థితి ఇది. సినిమాలు లేక ఎగ్జిబిట‌ర్లు అల్లాడిపోతున్నారు.

 400 థియేటర్లలో రిలీజ్

400 థియేటర్లలో రిలీజ్

సినిమాల కొరత కొనసాగుతున్న స‌మ‌యంలోనే 14న 400 థియేట‌ర్ల‌లో `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌`ను విడుద‌ల చేశాం. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఈ సినిమా బాగా ఆడుతోంది. 2 రోజుల‌కు రూ.90ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేసింది. 14న విడుద‌లైన నాలుగు సినిమాల్లోనూ ఈ సినిమా పెద్ద హిట్ అయిందంటే మేం స‌క్సెస్ సాధించిన‌ట్టే. మేం 20-30 కోట్ల‌తో సినిమా చేయ‌లేదు. చిన్న హీరోతో చేశాం. మా ఖ‌ర్చుతో పోలిస్తే చాలా లాభం వ‌చ్చింది. బీసీ సెంట‌ర్ల వారు బాగా ఆద‌రిస్తున్నారు. రూ.500కూలీకి వెళ్లేవారు కూడా రూ.50 పెట్టి ఈ సినిమాను చూస్తుండ‌టం గ్రేట్‌ అని అన్నారు. స‌ప్త‌గిరి ప్ర‌తిరోజూ తెల్లారుజామున 6 గంట‌ల‌కు లొకేష‌న్‌కి వ‌స్తే, రాత్రి 1 గంట‌కు ఇంటికి వెళ్తున్నాడు. ఆయ‌న చేసిన కృషికి ఆద‌ర‌ణ ద‌క్కింది`` అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X