"వకీల్ సాబ్" బ్యూటీ ఆవేదన .. ఇంట్లో వాళ్లే చీదరించారు

పేరుకి తెలుగు చిత్ర పరిశ్రమే కానీ మన పరిశ్రమలో ఒక్క తెలుగు హీరోలకి తప్ప తెలుగు హీరోయిన్స్ కి పెద్దగా అవకాశాలు ఉండవు అనే మాట ఎప్పుడు నుంచో వినిపిస్తోంది. మన తెలుగు సినిమాలో ఏదోకటి చేద్దాం అని చాలా మంది హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో కూడా అడుగుపెడుతున్నారు. కానీ ఇతర భాషల నుంచి వచ్చే పోటీతో వారు బాగా స్ట్రగుల్ అవుతున్నారు. పోనీ మన దగ్గర మంచి అందంగా ఉండే హీరోయిన్స్ లేరా అంటే..

హిందీ లేదా తమిళ్, మలయాళం నుంచి వచ్చిన వారి కంటే అందంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ మన తెలుగులో మాత్రం ఇప్పటికీ సరైన అవకాశాలు లేవని బాధ పడుతుంటారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అయ్యి అవకాశాలు కోసం చూడటం ఒకింత బాధ అయితే ఇది కాకుండా తమ ఇంట్లో నుంచి కూడా వారికి అవమానాలు లాంటివి ఎదురైతే అది ఇంకా బాధాకరం అని చెప్పక తప్పదు.

vakeel saab actress ananya nagalla emotional comments on her struggles

అలా సొంత తల్లి దగ్గరే అవమానాలు ఎదుర్కొందట తెలుగు బ్యూటీ వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వచ్చిన సోషల్ మెసేజ్ ఎమోషనల్ చిత్రం "వకీల్ సాబ్" అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ముగ్గురు అమ్మాయిలు ప్రధానంగా కనిపిస్తారు. వారిలో అంజలి, నివేధా థామస్‌లు అందరికీ తెలిసిన హీరోయిన్స్. కానీ ఆ తెలియని మూడో అమ్మాయే అనన్య నాగళ్ళ.

ఇనోసెంట్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన ఈమె నటించిన లేటెస్ట్ సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తన కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లోకి వస్తున్నట్టుగా ఇంట్లో చెప్పలేదట. నా మొదటి సినిమా రిలీజ్ కి కొంచెం సమయం ఉంది అనగా చెప్పాను అని అనన్య తెలిపింది.

దీంతో మా అమ్మ చాలా గొడవ పెట్టేసింది , కానీ కొన్నాళ్ల తర్వాత ఓరోజు నాకు కాల్ చేసి తమ బంధువుల ఇంటికి వెళితే వారు ఎంతో అవమానంగా మా అమ్మ పెంపకంపై మాట్లాడారు అని అనన్య ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుడు చాలా బాధపడ్డానని అనన్య తెలిపింది. దీనితో ఎలాగైనా సక్సెస్ కొట్టే చూపించాలి అని అక్కడే ఫిక్స్ అయ్యాననని ఆమె అన్నారు. అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను అంటూ అనన్య నాగళ్ల ఎంతో ఎమోషనల్ గా మాట్లాడింది.

దీనితో ఆ కామెంట్స్ విన్న ప్రతీ ఒక్కరూ మరింత ఎమోషనల్ అవుతున్నారు. మన తెలుగు హీరోయిన్స్ కి మరిన్ని అవకాశాలు రావాలని వాళ్లంతా కోరుకుంటున్నారు. తాజాగా అనన్య నాగళ్ళ నటించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ థియేటర్స్‌లో ఉంది. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్‌కి మంచి ప్రశంసలు వస్తున్నాయి. మరి ఈమెకు తాను కోరుకున్న పెద్ద బ్రేక్ దక్కుతుందో లేదో చూడాలి. నిజానికి వకీల్ సాబ్ తోనే ఆమెకు ఫేమ్ దక్కింది . కానీ ఆ సినిమా తనని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చేందుకు మాత్రమే పనికొచ్చింది. కానీ మెయిన్ హీరోయిన్ గా మాత్రం తాను ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X