పవన్ కళ్యాణ్‌తో 20ఏళ్ళ క్రితమే వర్క్ చేశా: వకీల్ సాబ్ డైరెక్టర్
టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటి. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్న వేణు శ్రీరామ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు.
వకీల్ సాబ్ డైరెక్ట్ చేయకముందే పవన్ కళ్యాణ్ తో 20 ఏళ్ళ క్రితం ఒకసారి వర్క్ చేసినట్లు చెప్పాడు. అయితే దర్శకుడిగా కాకుండా ఒక ప్రయివేట్ కూల్ డ్రింక్ కంపెనీకి పవన్ యాడ్ షూటింగ్ చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసినట్లు చెప్పారు. ఖుషి రిలీజ్ తరువాత పవన్ ఒక యాడ్ షూటింగ్ లో నటించడానికి అప్పుడే ఆయనకి అభిమానిని అయ్యానని కూడా వేణు వివరణ ఇచ్చాడు.

అయితే ఆ యాప్ తరువాత పవన్ కళ్యాణ్ మళ్ళీ మరో యాడ్ షూటింగ్ లో నటించలేదు. జనాలను మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి యాడ్స్ ని పూర్తిగా పక్కనపెట్టేశాడు. ఇక వేణు శ్రీరామ్ మొదట యాడ్స్ కంపెనీలో వర్క్ చేసి ఆ తరువాత దిల్ రాజు టీమ్ లో చేరాడు.
మొదట ఓ మై ఫ్రెండ్ సినిమాను డైరెక్ట్ చేసి డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఇప్పటికీ ఒక వర్గం ఆడియెన్స్ కి చాలా నచ్చుతుంది. ఇక ఆ తరువాత MCA సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకొని వకీల్ సాబ్ ఛాన్స్ కొట్టేశాడు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











