పవన్ బర్త్ డే వేడుకల్లో ముగ్గురు మృతి.. ‘వకీల్ సాబ్’ సహాయం.. తమన్, బోని కపూర్ సంతాపం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో జరిగిన అపశృతితో వకీల్ సాబ్ చిత్ర యూనిట్ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తూ మేమున్నామంటూ నిర్మాత దిల్ రాజు బృందం ముందుకు వచ్చింది. చిత్తూరులోని శాంతిపురం మండలంలో పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని బ్యానర్లు కడుతున్న అభిమానులకు కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు మరణించడంతోపాటు నలుగురు గాయపడ్డారు. ఇలాంటి విషాద పరిస్థితుల్లో వకీల్ సాబ్ టీమ్ సంతాప ప్రకటను, ఆర్థిక పరిహారాన్ని ప్రకటిస్తూ...
Recommended Video

అభిమానుల మరణవార్తతో మా హృదయాలు బరువెక్కాయి
పవర్ స్టార్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ముగ్గురు పవన్ కల్యాణ్ అభిమానులు మరణించారనే వార్త మమ్మల్ని కలిచి వేసింది. ఆ వార్త వినడంతో మా హృదయాలు బరువెక్కాయి. బాధితు కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. తీవ్ర విషాదంలో కూరుకుపోయిన కుటుంబాలకు లక్షలాది మంది పవన్ అభిమానులు అండగా నిలవడం ఊరట కలిగించింది అని వకీల్ సాబ్ యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.

2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం
కుటుంబానికి అండగా నిలువాల్సిన ఓ వ్యక్తి మరణాన్ని పూడ్చలేం. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ముందుకు వచ్చాం. ఈ సహాయంతో వారి బాధను పూడ్చలేం. వారు మానసికంగా మరింత ధైర్యంగా ఉండేందుకు అండగా నిలుస్తాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాం. అభిమానులందరూ తమ ప్రాణాలను జాగ్రత్తగా చూసుకోవాలి అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సూచించింది.

తమన్ తీవ్ర దిగ్బ్రాంతి.. సంతాపం
పవన్ కల్యాణ్ అభిమానుల మరణించారనే వార్తతో విషాదంలో మునిగిపోయిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. విద్యుత్ షాక్‌తో ముగ్గురు పవన్ కల్యాణ్ అభిమానులు మరణించడం చాలా చాలా విషాదకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నా సోదరులకు, బాధిత కటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని తమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

బాధిత కుటుంబాలకు బోనికపూర్ సంతాపం
పవన్ కల్యాణ్ అభిమానుల మరణవార్తను తెలుసుకొన్న బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. బాధిత కుటుంబాలకు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు వకీల్ సాబ్ యూనిట్ విడుదల చేసిన సంతాప ప్రకటనను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











