వకీల్ సాబ్ మోషన్ పోస్టర్.. దుమ్ములేపిన తమన్.. పవర్ స్టార్ ఈజ్ బ్యాక్!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తెరపై చూడాలని కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అజ్ఞాతవాసి అంతగా మెప్పించకపోవడం, తరువాత రాజకీయాలతో బిజీగా ఉండటంతో మళ్లీ తమ దేవుడిని తెరపై చూడాలని, బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూడసాగారు. వారి కోరికలు ఫలించి వకీల్ సాబ్ చిత్రాన్ని మొదలుపెట్టాడు. సినిమా అయితే మొదలుపెట్టాడు కానీ కరోనా అడ్డు రావడంతో ఆలస్యం అవుతూనే వస్తోంది.

సమ్మర్ ప్లానింగ్..
మామూలుగా అయితే వకీల్ సాబ్ చిత్రం సమ్మర్‌లోపే రిలీజై బాక్సాఫీస్‌ను అదరగొట్టాల్సింది. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాన్ చకచకా షూటింగ్‌లో పాల్గొని పూర్తి చేశాడు. అయితే చివరి దశకు చేరుకున్న సమయంలో కరోనా అడ్డుకట్ట వేసింది. లాక్ డౌన్ రావడంతో షూటింగ్‌లు మూలనపడ్డాయి.

అప్డేట్స్ కోసం ఆశగా..
ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు ఆశగా ఉన్నారు. వరుసగా ఒకదాని వెంట మరోకటి అనౌన్స్ చేస్తున్నారు గానీ వాటికి సంబంధించిన సమాచారం మాత్రం రావడం లేదు. ఇక వారి ఆశలు నెరవేరే సమయం వచ్చింది. నేటి పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతోన్నాయి.
మొదటగా వకీల్ సాబ్..
నేడు మూడు చిత్రాల అప్డేట్స్ రానుండగా.. అందులో మొదటగా వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రాబోతోందని ముందే డిసైడ్ చేశారు. ఆపై క్రిష్ తెరకెక్కించే సినిమా సమాచారం, అనంతరం చివరగా హరీష్ శంకర్ తెరకెక్కించే మూవీ అప్డేట్స్ రాబోతోన్నాయి. ప్రస్తుతం విడుదలై వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ మాత్రం దుమ్ములేపుతోంది.

అదరగొట్టిన తమన్..
సత్యమేవ జయతే అంటూ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్, పవన్ కళ్యాణ్ పోజు దుమ్ములేపింది. మొత్తానికి లాయర్ పాత్రకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ మేకోవర్, క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్ములేపింది. ఇక ఇది ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.
Recommended Video

నేషనల్ వైడ్‌గా ట్రెండ్..
పవన్ కళ్యాణ్ బర్త్ డేను ఫ్యాన్స్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1 సాయంత్రం ఆరు గంటలకు మొదలెట్టిన ట్వీట్ల యుద్దం నేటి సాయంత్రం ఆరింటి వరకు ట్వీట్ల యుద్దాన్ని చేయబోతోన్నారు. ఇప్పటికే #HBDPawanKalyan అనే హ్యాష్ జాతీయ స్థాయిలో హల్చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











