పవర్ స్టార్ రేంజ్ అంటే ఇది.. డిజాస్టర్, కరోనా ఉన్నా తగ్గని బిజినెస్.. ఈ సారి అంతకుమించి
టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు కాస్త క్లిక్కయినా కూడా కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. వరుస అపజయాలు ఎన్ని వచ్చినా కూడా ఆయన రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఇక వకీల్ సాబ్ బాక్సాఫీస్ బిజినెస్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

విడుదలయ్యే ప్రతి సినిమా కూడా..
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు పవర్ స్టార్. విడుదలయ్యే ప్రతి సినిమా కూడా మొదటి రోజు హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తాయి. ఇక పాజిటివ్ టాక్ కొంత వచ్చినా కూడా బిజినెస్ లెక్కలు మరో లెవెల్లో ఉంటాయి. పోటీగా ఎంత పెద్ద సినిమా ఉన్నా కూడా పవన్ సినిమా కలెక్షన్స్ పై పెద్దగా ప్రభావం చూపదు.
యువ హీరోయిన్ సానియా అయ్యప్పన్ అందాల ఆరబోత

అజ్ఞాతవాసి డిజాస్టరే..కానీ..
ఇక పవన్ కళ్యాణ్ చివరగా నటించిన సినిమా అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అని అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా ఓపెనింగ్స్ తోనే ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇప్పటికి కూడా టాప్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో అది కూడా ఒకటిగా కనిపిస్తుంది. నిజంగా ఆ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యేవి.

తొందర పడకుండా..
ఇక అజ్ఞాతవాసి వచ్చి మూడేళ్లయినా కూడా బాక్సాఫీస్ వద్ద పవన్ క్రేజ్ కొంత కూడా తగ్గలేదు. ఇక వకీల్ సాబ్ ఏప్రిల్ 9న రానున్న విషయం తెలిసిందే. అయితే సినిమా బిజినెస్ డీలింగ్స్ అన్ని కూడా ఇంకా క్లోజ్ అవ్వలేదు. అన్ని పనులు పూర్తయినా కూడా దిల్ రాజు తొందర పడటం లేదు. సమ్మర్ లోనే సినిమాను రిలీజ్ చేయాలని మొదటి నుంచి ఆలోచిస్తూ వస్తున్నాడు. రీలీజ్ చేయాలని అనుకుంటే సంక్రాంతికే రిలీజ్ చేసేవారు.

అప్పుడే 100కోట్లు..
ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే 100కోట్లు దాటినట్లు సమాచారం. ఇంకా మిగతా ఏరియాల బిజినెస్ చాలా వరకు పూర్తవ్వాల్సి ఉంది. కరోనా ఉన్నా కూడా మార్కెట్ పై కొంత ప్రభావం కూడా కనిపించడం లేదు. చూస్తుంటే పవర్ స్టార్ ఈ సారి గతంలో కంటే ఎక్కువ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసేలా ఉన్నాడని తెలుస్తోంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి. వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











