పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: మరో ఓటీటీలోనూ ‘వకీల్ సాబ్’ విడుదల.. వాళ్లకు మాత్రమే ఛాన్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్నంత మంది అభిమానులు మరో హీరోకు లేరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్న అతడు.. తన క్రేజ్‌ను ఖండాంతరాలు దాటించుకున్నాడు. ఫలితంగా ఏ సినిమా విడుదలైన భారీ ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల 'వకీల్ సాబ్' అనే మూవీతో వచ్చాడతను. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా విడుదలైంది. ఈ నేపథ్యంతో ఇది మరో ఓటీటీలోనూ రిలీజ్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

‘వకీల్ సాబ్’తో కమ్‌బ్యాక్ అయిన పవన్
మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్‌లు కీలక పాత్రలు చేశారు.

ప్రభుత్వం నుంచి ఎదురైన ఆటంకాలతో
'వకీల్ సాబ్' కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో హడావిడి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా వాళ్లంతా ఈ సినిమా విడుదలను పండుగలా జరపాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బెనిఫిట్, స్పెషల్ షోలు రద్దు చేసింది జగన్ సర్కారు. ఆ వెంటనే టికెట్ రేట్లను తగ్గించాలని కొత్త జీవోను తీసుకొచ్చింది. ఆ తర్వాత కరోనా కారణంగా థియేటర్లు మూత పడిపోయాయి.

ఓపెనింగ్స్ భారీగా... నష్టాలే మిగిలాయి
పవన్ రీఎంట్రీ మూవీ కావడంతో 'వకీల్ సాబ్' మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాయి. తద్వారా ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి కలెక్షన్లను అందుకుంది. అయితే, లాంగ్ రన్‌లో పైన పేర్కొన్న కారణాల వల్ల వసూళ్లు తగ్గాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోకుండానే సినిమా ముగిసిపోయింది. తద్వారా నష్టాలు వచ్చాయి.

ఓటీటీలోకి వచ్చేసిన పవన్ ‘వకీల్ సాబ్’
'వకీల్ సాబ్' సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఆరంభంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమాను యాభై రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేస్తామని చెప్పారు. కానీ, థియేటర్లలో కేవలం రెండు వారాలు మాత్రమే ప్రదర్శితమైన 'వకీల్ సాబ్'.. ఆ తర్వాత రన్‌ను ముగించుకుంది. దీంతో అమెజాన్‌లో ఇటీవలే విడుదల చేశారు.

అక్కడ అదిరిన రెస్పాన్స్... భారీగా క్లిక్స్
ఏప్రిల్ 30 అమెజాన్ ప్రైమ్‌లో 'వకీల్ సాబ్' మూవీ విడుదలైంది. థియేటర్లలో మాదిరిగానే ఈ చిత్రానికి అక్కడ కూడా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే సినిమాను చూసిన వాళ్లతో పాటు కొత్త వాళ్లు కూడా దీన్ని చూస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ పవన్ కల్యాణ్ పేరును మరోసారి ట్రెండ్ చేస్తున్నారు.
Recommended Video

మరో ఓటీటీలోనూ ‘వకీల్ సాబ్’ విడుదల
తాజాగా 'వకీల్ సాబ్' మూవీ మరో ఓటీటీ సంస్థ ఆహాలోనూ విడుదలైంది. అయితే, ఇది కేవలం ఓవర్సీస్‌లో ఉన్న వారి కోసం మాత్రమే. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం కేవలం ఇండియాలోనే స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, పవన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీని అక్కడ కూడా అందుబాటులోకి తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఆహాలో వదిలారు.


Click it and Unblock the Notifications











