twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ సర్కార్‌కు మరో షాక్.. హైకోర్టులో మరో పిటిషన్.. ముదురుతున్న వకీల్ సాబ్ టికెట్ల వివాదం!

    |

    ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమా టికెట్ల పెంపు వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తున్నది. గత కొద్ది రోజులు ప్రభుత్వ అధికారులకు, ఎగ్జిబిటర్లు, థియేటరల్ యజమానులు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్నది. అయితే టికెట్ల రేట్లు పెంపుపై డివిజన్ బెంచ్‌ను సవాల్ చేస్తూ సోమవారం అంటే ఏప్రిల్ 12వ తేదీన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు కావడం ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

    వివాదంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు

    వివాదంగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు

    భారీ అంచనాలతో ఏప్రిల్‌ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ చిత్రంపై ఏపీ ప్రభుత్వ అధికారులు మోకాలడ్డారు. గత కొద్ది రోజులుగా వస్తున్న టికెట్ల రేట్లు పెంపు విధానాన్ని అడ్డుకొన్నారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచ్ జోక్యం చేసుకొని.. మూడు రోజులపాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.

    హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో కొత్త మలుపులు

    హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో కొత్త మలుపులు

    అయితే వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన టికెట్ల రేట్లు పెంచుకోమని సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ అధికారులు సవాల్ చేశారు. శనివారం అంటే ఏప్రిల్ 10 తేదీన ప్రభుత్వం తరఫున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్.. టికెట్ల రేట్లు పెంపుకు అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

    హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

    హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

    అయితే తాజాగా టికెట్ రేట్ల పెంపుపై ఆంక్షలు విధించిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులన సవాల్ చేస్తూ ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఏపీ సర్కార్ జారీ చేసే కొత్త జీవో వచ్చే వరకు పాత ధరలను అలాగే అమలు చేయాలని పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.

    90 కోట్ల గ్రాస్, 60 కోట్ల షేర్

    90 కోట్ల గ్రాస్, 60 కోట్ల షేర్

    ఇదిలా ఉండగా, పలు రకాల వివాదాల మధ్య వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధిస్తున్నది. ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.90 కోట్ల గ్రాస్, రూ.60 కోట్ల షేర్‌ను రాబట్టినట్టు సమాచారం. అధికారికంగా మూడో రోజు వసూళ్లను ప్రకటించకపోవడం వల్ల కొంత గందరగోళం నెలకొన్నది.

    English summary
    AP Theatre owners, Exhibitors House motion petition on Vakeel Saab Ticket rates hike: Power Star Pawan Kalyan's Vakeel Saab is set to release on April 9th. This movie trailer set a new record in Tollywood. Vakeel Saab trailer gaint 23.4 million views in 24 hours. In this occassion, Fimibeat Telugu brings Day 3 expected collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X