twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం.. సీఎం అంటూ పవన్ ఫ్యాన్స్ నినాదాల హోరు.. వకీల్ సాబ్ ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డు.. సరికొత్త హిస్టరీ..

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డుల మోత మోగించింది. టాలీవుడ్‌ హిస్టరీలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ట్రైలర్‌కు అభిమానులు, సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గంటలు గడిచిన కొద్ది సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఈ ట్రైలర్ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నది. వకీల్ సాబ్ ట్రైలర్ సాధిస్తున్న రికార్డుల గురించి మరిన్ని వివరాలు..

    దిల్ రాజ్ ప్లాన్ వర్కవుట్

    దిల్ రాజ్ ప్లాన్ వర్కవుట్

    తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వకీల్ సాబ్ ట్రైలర్‌ రిలీజ్‌ను నిర్మాత దిల్ రాజు డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 90కి పైగా థియేటర్లలో ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా పవర్ స్టార్ అభిమానులు పోటెత్తారు. దీంతో ఈ ట్రైలర్ అనూహ్యమైన హైప్ తీసుకురావాలనే ప్లాన్ వర్కవుట్ అయిందనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తున్నది.

     ఆర్టీసీ క్రాస్ రోడ్డులో రచ్చ

    ఆర్టీసీ క్రాస్ రోడ్డులో రచ్చ

    తెలుగు సినిమాకు రాజధానిగా పేరున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో దిల్ రాజు చేతులు మీదుగా వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజైంది. అభిమానులు భారీగా తరలిరావడంతో సుదర్శన్ థియేటర్ లోపల, బయట అభిమానులతో కిక్కిరిసిపోయింది. బాణాసంచా కాల్చి అభిమానులు పండుగ చేసుకొన్నారు.

    సీఎం.. సీఎం అంటూ నినాదాల హోరు

    సీఎం.. సీఎం అంటూ నినాదాల హోరు

    వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్బంగా భారీ సంఖ్యలో అభిమానులు సీఎం.. సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ నినాదాలు కేవలం హైదరాబాద్‌కు పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ చోట ఫ్యాన్స్ నినాదాలు చేసి తన అభిమానాన్ని చాటుకొన్నారు. ఏపీలో కొన్ని చోట్ల అపశృతులు చోటుచేసుకొన్నాయి.

     18 మిలియన్ వ్యూస్‌తో రికార్డు

    18 మిలియన్ వ్యూస్‌తో రికార్డు

    ఇదిలా ఉండగా, మార్చి 26 తేదీ 6 గంటల ప్రాంతంలో రిలీజైన వకీల్ సాబ్ ట్రైలర్ అనూహ్యంగా దూసుకెళ్తున్నది. ఈ ట్రైలర్ మార్చి 27 తేదీ 3 గంటల వరకు 18 మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్‌ను సాధించింది. టాలీవుడ్‌లో ఇది ఒక రికార్డుగా నమోదైంది.

    ఇండియాలో నంబర్ 1 ట్రెండింగ్

    ఇండియాలో నంబర్ 1 ట్రెండింగ్

    ఇక వకీల్ సాబ్ ట్రైలర్ ప్రభంజనం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రైలర్ ట్రెండ్ అవుతున్నది. ఇండియాలో నంబర్ 1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్నది. దాదాపుు 18 గంటల 5 నిమిషాల్లో ఈ ట్రైలర్ 900k లైక్స్ సాధించింది. టాలీవుడ్‌లో ఇది ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది.

    English summary
    Ram Charan emotional tweet on Pawan Kalyan: Celebrities twitter review on Vakeel Saab Trailer: Power Star Pawan Kalyan's Vakeel saab movie trailer released in Telugu states in Theatre. In this occassion, Dil Raju made emotional speech at Pawan Kalyan's Vakeel Saab Trailer event at Sudhrshan Theatre. He said trailer is only breakfast, Lunch and dinner will be on April 9th which is Vakeel Saab releasing on the date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X