రామ్ చరణ్ 'ఎవడు' కాపీ మ్యాటర్ పై ఖండన...

By Srikanya

హైదరాబాద్ : వక్కంతం వంశీ కథతో 'ఎవడు' చిత్రం రూపుదిద్దుకొంటోంది. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్నారు. ఇది హాలీవుడ్‌ చిత్రం 'ఫేస్‌ ఆఫ్‌' ఆధారంగా తెరకెక్కుతోందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియా వారు వక్కంతం వంశిని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిచ్చారు.

వక్కంతం వంశీ మాట్లాడుతూ.... ''ప్రస్తుతం తెలుగు తెర మీద చాలా ప్రేమకథలొస్తున్నాయి. అంతమాత్రాన అవన్నీ మరో చరిత్రలే అంటే ఒప్పుకోగలమా? అలాగే రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ కలిసి నటిస్తున్న 'ఎవడు' చిత్రానికి ఆధారం 'ఫేస్‌ ఆఫ్‌' అంటున్నారు. ఆ ప్రచారంలో నిజం లేదు.

అలాగే కొంతమంది కిక్‌ సినిమాని జెంటిల్‌మెన్‌తో పోల్చారు. కిక్‌ దొంగ-పోలీస్‌ కథగా భావించి ఉండొచ్చు. అలా అనుకుంటే జెంటిల్‌మెన్‌ కంటే ముందే చాలా అలాంటి కథలు వచ్చాయి అన్నారు అని చెప్పుకొచ్చారు.

ఇక ఎవడు చిత్రం విషయానికి వస్తే.. ఈ చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... మంచికీ చెడుకీ, న్యాయానికీ అన్యాయానికీ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అధిపత్యం చేతులు మారినా... చివరికి విజయం మంచి వైపే ఉంటుంది. అయితే ధర్మం వైపు నిలబడి పోరాడేవాడు కావాలి. ఏ సమరమైనా ఒక్కడే మొదలుపెడతాడు. ఆ తరవాత సమూహం అతని వెంట నడుస్తుంది. మరి ఆ ఒక్కడు ఎవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ విషయాలు తెలియాలంటే 'ఎవడు' చూడాల్సిందే. ..అంటున్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ... ''నాలుగు సన్నివేశాల తరవాత ఓ పాట, వెంటనే పోరాట సన్నివేశం.. ఈ తరహాలో సాగే చిత్రం కాదిది. సినిమా ఎత్తుగడే కొత్తగా అనిపిస్తుంది. పోరాట ఘట్టాలు కూడా విభిన్నంగా తీర్చిదిద్దారు. బన్నీ కనిపించేది కొద్దిసేపే అయినా.. ఆ పాత్రే కథను మలుపు తిప్పుతుంది'' అన్నారు.

'ఎవడు' లో రామ్ చరణ్ సరసన శ్రుతిహాసన్‌, అమీజాక్సన్‌ హీరోయిన్స్ . అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. దిల్‌ రాజు నిర్మాత. సహనిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌; సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X