పని రాక్షసుడు, ఆకలితో ఉన్న పులి: బన్నీ గురించి వక్కంతం వంశీ

By Bojja Kumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. మే 4న సినిమా విడుదల చేస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వక్కంతం వంశీ భావోద్వేగంతో ప్రసంగించారు.

Recommended Video

Naa Peru Surya Audio Launch
నా కల నెరవేరడానికి ఎన్నో చేతులు కలిశాయి

నా కల నెరవేరడానికి ఎన్నో చేతులు కలిశాయి

ఒక మనిషిగా కల కంటే.. ఆ కలను నేరవేర్చడానికి ఎన్నో చేతులు కలిస్తే ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. మంచి కథ రాసుకున్నాను. మా అన్న నల్లమలుపు బుజ్జిగారి వల్లే నా కథ బన్నీకి చేరింది. ఆయనకు థాంక్స్‌. నాకు సపోర్టుగా ఉన్న నా తల్లిదండ్రులు, నా భార్యతో పాటు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువుగారు దర్శకరత్న దాసరి నారాయణ రావుగారికి థాంక్స్‌. ఆయన ఈ సినిమాని చూస్తారని అనుకున్నాను. కానీ ఈరోజు మన మధ్య లేరు. కానీ ఆయన పుట్టినరోజున సినిమా విడుదలవుతుండటం ఆనందంగా ఉంది... అని వక్కంతం వంశీ తెలిపారు.

చాలా అదృష్టం ఉంటేనే ఇది సాధ్యం

చాలా అదృష్టం ఉంటేనే ఇది సాధ్యం

ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి రాజీవ్‌ రవి. మన దేశంలో గొప్ప సినిమాటోగ్రాఫర్లలో ఆయన ఒకరు. ఎన్నో పెద్ద సినిమాలు చేశారు. ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌ గారిని నమ్మి ముందుకు వెళ్లాను... ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టలేదు... ఆయనకు థాంక్స్‌. నా చీఫ్‌ కో డైరెక్టర్‌ శివకు థాంక్స్‌... ఆయన లేకుండా ఈ సినిమా ఇంత స్మూత్ గా అయ్యేది కాదు. బన్నీవాసుగారు టెన్షన్ అంతా తనే తీసుకుని మాకు ఎంతో కంఫర్ట్‌ను క్రియేట్‌ చేశారు. అలాగే బన్నితో సినిమా చేయాలని ఏరోజు ఎంత ఖర్చు పెడుతున్నామని కాకుండా మంచి సినిమా తీయాలని నన్ను నమ్మి సినిమా చేసిన లగడపాటి శ్రీధర్‌గారికి, నాగబాబుగారికి థాంక్స్‌. చాలా అదృష్టం ఉంటేనే మంచి ప్రొడ్యూసర్లు దొరుకుతారు.

ఆ ఒక్కడు రాజముద్ర వేయకపోతే ఏదీ జరుగదు

ఆ ఒక్కడు రాజముద్ర వేయకపోతే ఏదీ జరుగదు

ఇవన్నీ జరుగాలంటే ఒక్కడు ఒకే అనాలి. ఆ ఒక్కడు రాజముద్ర వేయకపోతే ఏదీ జరుగదు. ఆ ఒక్కడే స్టైలిష్ స్టార్..... కొత్త డైరెక్టర్ అయినా నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చి ఆయన గురించి జీవితాంతం చెబుతూనే ఉంటాను. ఓ కొత్త డైరెక్టర్‌ని నమ్మి..వాడి చేతిలో మెగాఫోన్‌ పెట్టి సినిమా చేయడమంటే చిన్న విషయం కాదు. కథ నచ్చింది.. నమ్మారు. సినిమా చేశారు. మంచి సినిమా చేశాననే తృప్తిగా ఉంది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను.

బన్నీ పని రాక్షసుడు

బన్నీ పని రాక్షసుడు

బన్నీ పని రాక్షసుడు. ప్రతిషాట్‌ను కష్టపడి సొంతంగా చేశారు. నాగబాబు చెప్పినట్లే ఆయన ఒక ఆకలితో ఉన్న పులిలా ఉంటారు. సినిమాలో హీరోకి బోర్డర్‌కి వెళ్లాలనేది డ్రీమ్. చచ్చిపోతే చచ్చిపోతాను కానీ ఇక్కడ కాదు బోర్డర్లోనే...తన డ్రీమ్ సాధించుకోవడం కోసం పడ్డే కష్టం, చేసిన జర్నీయే ఈ సినిమా.

ప్రేక్షకులు గర్వంగా తలెత్తుకుని బయటకు వస్తారనే నమ్మకం ఉంది

ప్రేక్షకులు గర్వంగా తలెత్తుకుని బయటకు వస్తారనే నమ్మకం ఉంది

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌గారి గురించి... మేము ఆ పాత్ర అనుకున్న తర్వాత చాలా ఫ్రెష్ ఫేస్ కావాలనే ఉద్దేశ్యంతో అర్జున్ గారిని తీసుకోవాలనుకున్నాం. ఆయన కథ విన్న తర్వాత ఆయనకు నచ్చింది, నాలుగు రోజులు ఆలోచించిన తర్వాత ఓకే చెప్పారు, మాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. శరత్‌కుమార్‌, నదియా, బోమన్‌ ఇరాని, హరీశ్‌ ఉత్తమన్‌, అనూప్‌సింగ్‌ ఇలా అందరూ చాలా బాగా చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు గర్వంగా తలెత్తుకుని బయటకు వస్తారనే నమ్మకం ఉంది అని వక్కంతం వంశీ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X