బన్నీ డైరెక్టర్ తో రవితేజ మూవీ!
రచయితగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న వక్కంతం వంశీ నా పేరు సూర్య చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారారు. నా పేరు సూర్య చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించడంలో విఫలం చెందింది. అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలతో విడుదలైంది.
కానీ అంచనాలు అందుకోలేక ఈ చిత్రం నిరాశపరిచింది. తొలిప్రయత్నం నిరాశ కలిగించినప్పటికీ దర్శకుడు వక్కంతం వంశీకి ఈ చిత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చిందని చెప్పొచ్చు. వక్కంతం వంశీ తన రెండవ చిత్రానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మాస్ మహారాజ రవితేజని డైరెక్ట్ చేయడానికి వక్కంతం వంశీ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి రవితేజ ఈ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











