లవర్స్ డే స్పెషల్: ‘మద్దు’తో మంచు లక్ష్మి (ఫోటోలు)
హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే తెలుగు సెలబ్రిటీల్లో మంచు లక్ష్మి ప్రసన్న ఒకరు. ఆండీ శ్రీనివాసన్‌ను చాలా ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఆమె....ప్రేమికులకు, ప్రేమకు చాలా విలువ ఇస్తారు. ఆండీ లాంటి వ్యక్తి తన జీవితంలోకి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.
ఆండీ స్పందిస్తూ....మంచు లక్ష్మి హాటెస్ట్ చిక్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేసారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచు లక్ష్మి, ఆండీ ప్రేమికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రపంచం మొత్తం ప్రేమతో నిండి పోవాలని ఆకాంక్షించారు.
ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు కూతురైన మంచు లక్ష్మి అమెరికాలో చదువుకుని 2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొంత కాలం విదేశాల్లో ఉండి తర్వాత ఇండియాకి వచ్చిన మంచు లక్ష్మి తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

ప్రేమ గుర్తు
తన భర్త ఆండీ శ్రీనివాసన్‌కు గతేడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇలా హాట్ హాట్ బహుమతి ఇచ్చింది.

తల్లిదండ్రులయ్యారు
మంచు లక్ష్మి-ఆండీ ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. సరోగసీ పద్దతి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

అన్యోన్య దాంపత్యం
గత తొమ్మిదేళ్లుగా మంచు లక్ష్మి, ఆండీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు.

ప్రేమ.. పెళ్లి
అమెరికాలో చదువుకుని 2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్
మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాస్ వాలంటైన్స్ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు.


Click it and Unblock the Notifications











