»   » వాలెంటైన్స్ స్పెషల్ : తెలుగు హీరోలు.. లవ్ స్టోరీలు

వాలెంటైన్స్ స్పెషల్ : తెలుగు హీరోలు.. లవ్ స్టోరీలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ రోజు వాలెంటైన్స్ డే. ఈ సందర్బంగా...మన జీవితంలోవి, మన సన్నిహితుల జీవితంలోని ఎన్నో లవ్ స్టోరీలు మనం గుర్తు చేసుకుంటాం. అదే సమయంలో సినిమావాళ్లు తీసిన లవ్ స్టోరీలు కూడా ఒక్కోసారి గుర్తుకు వచ్చి మనస్సు ఆనందింప చేస్తాయి.

‘ప్రేమ'ను మన సినీ డైరక్టర్స్ వారి అభిరుచికి అనుగుణంగా అద్భుత దృశ్య కావ్యాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హీరోలు కూడా తమదైన శైలిలో ప్రేమ కథల్లో నటించి ప్రేమను వెండితెరపై పండించారు.

కొందరు విజయవంతమైన ప్రేమ కథలను రూపొందిస్తే.. మరికొందరు విషాదాంత ప్రేమ కథలను తెరకెక్కించి విజయాలు సొంతం చేసుకున్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. అన్నీ ప్రేక్షకులను అలరించాయి.

ప్రేమ ప్రధానంగా టాలీవుడ్ లో కూడా అదిరిపోయో సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలనాటి ఎన్టీఆర్ నుండి నిన్నటి శర్వనంద్ వరకు సుపర్ హిట్ అయన సినిమాల లిస్ట్ ఇక్కడ వుంది చూడండి.

నాగేశ్వరరావు

నాగేశ్వరరావు

అదేంటో అమర ప్రేమికుడు అంటే టక్కున గుర్తొచ్చే వ్యక్తి అక్కినేని. సినిమా ప్రారంభం రోజుల్లోనే పార్వతి కోసం ‘దేవదాస్‌'గా మారాడు. ఆ తర్వాత ‘ప్రేమాభిషేకం' చేసి ‘ప్రేమనగర్‌' కూడా నిర్మించాడు.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

ప్రేమ విషయంలో ఎన్టీఆర్ ఏమీ తీసిపోలేదు... మల్లీ శ్వరలో నాగరాజుగా ఆయన్ను మరిచిపోలేం. అలాగే.. ‘పాతాళ భైరవి'లో యువరాణి కోసం తోటరాముడిలా మారి మాంత్రికుడిని మట్టుబెట్టడం ఎప్పటికీ గుర్తుండే అంశమే.

సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ

మీకు తెలుసా..యాక్షన్‌ హీరో కృష్ణ కూడా ‘దేవదాస్‌' అయ్యాడు.

చిరంజీవి

చిరంజీవి

చిరు కూడా కెరీర్ ప్రారంభ దశలో ప్రేమ చుట్టూ తిరిగే కథలు చేసారు. అయితే మెగాస్టార్ అయిన తర్వాత సమాజాన్ని ప్రేమించే..
‘శంకర్‌దాదా' కథలు చేసి.. ‘రోగిని ప్రేమించలేని డాక్టర్‌ కూడా రోగితో సమానం' అని హితవు పలికారు.

బాలకృష్ణ

బాలకృష్ణ

బాలకృష్ణ అయితే అప్పట్లోనే...అనార్కలీ కోసం సలీమ్‌గా మారిపోయి ‘హసీనా.. ఓ హసీనా' అంటూ పాట అందుకున్నాడు.

నాగార్జున

నాగార్జున

తండ్రిలాగే నాగ్ కూడా ప్రేమ విషయంలో ముదిరిన వాడే. అప్పట్లో ‘మజ్ను'గా ‘మన్మథుడి'గా ‘గీతాంజలి' ప్రేమ కోసం పరితపించాడు.

వెంకటేష్

వెంకటేష్

అవును వెంకటేష్ లవ్ స్టోరీలు చేసాడు. మ్యాగీ ‘ప్రేమ' కోసం వెంకటేష్‌ పృథ్వీగా మారాడు. ఆ తర్వాత శ్రీను, చంటి, ‘ప్రేమించుకుందాం రా..' , ప్రేమంటే ఇదేరా అంటూ ప్రేమకు అర్దం చెప్పే ప్రయత్నం చేసాడు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్‌కల్యాణ్‌ కెరీర్ లవ్ స్టోరీలు ప్రారంభ దశలో ఉన్నాయి. అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి ప్రేమ కథే. ‘తొలిప్రేమ', ‘సుస్వాగతం' , ‘ఖుషీ' సూపర్ లవ్ స్టోరీలే.

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్‌బాబు ఏమన్నా తక్కువ తిన్నాడా... ‘రాజకుమారుడు', ‘యువరాజు',నిన్నటి ‘శ్రీమంతుడు' అన్నిటిలో లవ్ స్టోరీలు కామన్.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

వన్‌సైడ్‌ లవ్‌ గొప్పదంటూ కెరీర్ మొదట్లోనే ‘ఆర్య'గా అల్లుఅర్జున్‌ ప్రేమకు సరికొత్త అర్థం చెప్పాడు.

శర్వానంద్

శర్వానంద్

శర్వానంద్ తన కెరీర్ లో వెన్నెల వంటి డిఫెరెంట్ లవ్ స్టోరీతో వచ్చి మొన్నటి..ఎక్సప్రెస్ రాజా దాకా లవ్ స్టోరీల చుట్టూనే తిరుగతున్నాడు.

రామ్ చరణ్

రామ్ చరణ్

ఆరెంజ్ లాంటి లవ్ స్టోరీ రామ్ చరణ్ మాత్రమే చేయగలరు. అలాగే మగధీర లాంటి లవ్ స్టోరీ కూడాను.

నాని

నాని

అష్టాచెమ్మా తొ మొదలెట్టిన నాని..‘అలా మొదలైంది' అంటూ... ప్రేమ కోసం ‘ఈగ'గా మారి ‘భలే భలే మగాడివోయ్‌' , నిన్నటి కృష్ణగాడి వీరప్రేమ గాధ దాకా లవ్ స్టోరీలతోనే నెట్టుకొస్తున్నాడు

నాగ చైతన్య

నాగ చైతన్య

‘ఈ ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించానని' అడిగిందెవరు నాగచైతన్యే. ‘ఏమాయ చేశావె' అద్బుతమైన లవ్ స్టోరీ తర్వాత ‘100% లవ్‌' కూడా లవ్ స్టోరీనే.

నితిన్

నితిన్

లవ్ స్టోరీతోనే కెరీర్ మొదలెట్టాడు నితిన్. జయం,దిల్ , ఇష్క్, ‘గుండె జారి గల్లంతయ్యిందే' , హార్ట్ ఎటాక్, నిన్నటి ‘చిన్నాదాన నీకోసం' అంటూ లవ్ స్టోరీలతో కంటిన్యూ అవుతున్నాడు.

ప్రభాస్

ప్రభాస్

ప్రభాస్ కి పేరు తెచ్చి పెట్టిన సినిమాలన్నీ లవ్ స్టోరీలే. ‘వర్షం', ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై', ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' అంటూ...‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్‌ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు' అని మిర్చితో పాటు లవ్ ని కలిపాడు.

English summary
Here is a list of Telugu movies, which we think have redefined 'love' and stand tall among the love tales that were ever told in the language.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu