వ్యభిచారం కేసులో అరెస్టయిన ఎంటీవీ యాంకర్
లాస్ ఏంజిల్స్: ఈ మధ్య కాలంలో పలువురు సెలబ్రిటీలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్లు, టీవీ నటీమణులు, పలువురు యాంకర్లు కూడా వివిధ కారణాలతో ఈ చీకటి కూపం వైపు వెలుతున్నారు. ఇందులో కొందరు అవకాశాలు లేక, ఏ దారి లేక బ్రతకడానికి డబ్బు సంపాదించడం కోసం, మరికొందరు జల్సాలకు అలవాటు పడి ఈ చట్టవిరుద్ధమైన వృత్తిలోకి దిగుతున్నారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తాజాగా ఎంటీవీ యాంకర్ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. అమెరికాలోని దిలావర్ స్టేట్ కు చెందిన ఎంటీవీ యాంకర్ వాలెరీ ఫెయిర్‌మన్ పట్టుబడింది. 21 ఏళ్ల ఈ అమ్మడు డబ్బు కోసమే తాను వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి.

దిలావర్ స్టేట్ పోలీసులు ఓ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతుందనే విషయం తెలుసుకుని స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా....ఈ ఎంటీవీ యాంకర్ పట్టుబడింది. ఈ స్టింగ్ ఆపరేషన్లో దిలావర్ స్టేట్ పోలీస్, న్యూకాస్ట్లే గవర్నర్స్ టాస్క్ ఫోర్స్, న్యూ కాస్ట్లే కంట్రీ డ్రగ్ యూనిట్, న్యూ కాస్ట్రలే కంట్రీ పోలీస్ డిపార్టుమెుంట్ సంయుక్తంగా పాల్గొన్నాయి. టీవీ యాంకర్ తో పాటు మరికొందరు పట్టుబడ్డట్లు సమాచారం.
ఎంటీవీలో 2010లో ప్రసారమైన ‘16 అండ్ ప్రెగ్నెంట్' సీజన్ 2 అనే కార్యక్రమంలో వాలెరీ ఫోయిర్ మన్ యాంకరింగ్ చేసింది. అంతకు ముందు కూడా పలు టీవీ కార్యక్రమాల్లో యాంకరింగ్ చేసింది. పోలీసులకు పట్టుబడటం ఆమెకు ఇది కొత్తేమీ కాదని అంటున్నారు. 2011లో వేదింపుల కేసులో ఆమె అరెస్టయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











