జూనియర్ ఎన్టీఆర్ ని మోసం చేసిన వల్లభనేని వంశీ.. టీడీపీ నేత సంచలనం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇప్పుడు ఒక టిడిపి నేత చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లతో క్లోజ్గా ఉంటారు అన్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత వల్లభనేని వంశీ మీద ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ఎన్టీఆర్ తో అదుర్స్
ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలుగులో నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు. 2009వ సంవత్సరంలో కోదండరామి రెడ్డి దర్శకుడిగా ముమైత్ ఖాన్ హీరోయిన్ గా రూపొందిన పున్నమినాగు సినిమాతో ఆయన నిర్మాతగా మారారు. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అదుర్స్ సినిమాకు వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని ఇద్దరూ కలిసి నిర్మాతలుగా వ్యవహరించారు.

చివరిగా ఆ సినిమా
ఇక ఆ తర్వాత సినిమాల నుంచి చాలా గ్యాప్ తీసుకున్న వల్లభనేని వంశీమోహన్ మళ్లీ 2018వ సంవత్సరంలో రవితేజ హీరోగా వచ్చిన టచ్ చేసి చూడు సినిమా తో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో మన సినిమాల గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ మోహన్ గురించి ఆయన ఎన్టీఆర్ ను మోసం చేశారని టీడీపీ నేత ఒకరు ఆరోపించారు.

ఎన్టీఆర్ సహా పరిటాల రవిని మోసం చేసి
గతంలో వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ నేత, సినీ నిర్మాతగా ఉన్న పరిటాల రవి దగ్గర అనుచరుడిగా ఉండేవారు. అయితే పరిటాల రవి చనిపోయిన సమయంలో ఆయన ఆస్తులు కాజేశారని టిడిపి అధికార ప్రతినిధి సూర్యప్రకాష్ ఆరోపించారు. అలాగే నమ్మి సినిమా చేసిన ఎన్టీఆర్ ను కూడా ఒక ల్యాండ్ విషయంలో వల్లభనేని వంశీ మోహన్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇక గతంలో కూడా కొడాలి నాని ఎన్టీఆర్ మధ్య ల్యాండ్ విషయంలో తేడాలు వచ్చాయని పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

నాకు పార్టీ ముఖ్యం
అయితే కొడాలి నాని వైసీపీలో చేరిన సమయంలో ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చి కొడాలి నాని తనకు స్నేహితుడే కానీ తనకు పార్టీని ముఖ్యమని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త గానే ఇప్పటికీ ఉన్నానని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ ఆ క్లారిటీ ఇచ్చారు కానీ 2009 ఎన్నికలలో యాక్సిడెంట్ జరిగిన తరువాత ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించిన దాఖలాలు లేవు.

ఎన్టీఆర్ రావాలి
అయితే ఎన్టీఆర్ టిడిపిలో ఆక్టువ్ అవ్వాలి అంటూ అడపాదడపా ఆయన ఫ్యాన్స్ ఆందోళనలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటిదాకా నేరుగా స్పందించింది లేదు. ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క హిందూపురం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు..


Click it and Unblock the Notifications











