హైదరాబాదీ పిల్లతో వరుణ్ తేజ్ చిందులు.. హరీష్ శంకర్ హైలైట్ స్కెచ్
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వాల్మీకి'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా వాల్మీకి రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాలో ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్.
సాధారణంగా ఐటెం సాంగ్ అనగానే ఇంగ్లీష్ పాపనో లేక సీనియర్ గ్లామర్ హీరోయినో గుర్తుకు రావడం కామన్. కానీ అందుకు భిన్నంగా ఈ ఐటెం సాంగ్ కోసం డింపుల్ హయాతీ అనే హైదరాబాద్ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు హరీష్. వరుణ్ తేజ్ 'వాల్మీకి' సినిమాలో డింపుల్ హయాతీ ప్రత్యేక గీతంలో నటిస్తోందని ఓ ఆంగ్ల మీడియా రాసిన ఆర్టికల్‌ను హరీశ్ శంకర్ లైక్ చేయడం ద్వారా ఈ విషయం కన్ఫర్మ్ అయింది. అనతకుముందు 'దేవి 2' చిత్రంలో ప్రభుదేవాతో కలిసి నటించింది డింపుల్. ఇక వాల్మీకిలో హీరో వరుణ్ తేజ్, విలన్ అథర్వా మురళి తో కలిసి డింపుల్ చిందులు ఆకట్టుకోనున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13 వ తేదీన విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు వాల్మీకి సినిమాకు మొదటి నుంచే కొన్ని షాకులు తగులుతున్నాయి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే నటించాల్సి ఉండగా.. మొదట్లోనే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత దేవిశ్రీ విషయంలోనూ అదే ప్రచారం జరిగింది.


Click it and Unblock the Notifications











