twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'లైవ్'లో మర్డర్ జరిగితే... మోడల్‌గా లక్ష్మీరాయ్

    By Pratap
    |

    హైదరాబాద్: తెల్లారితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ఇందులోనే అంతు చిక్కని రీతిలో హత్య. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు. ఇంటిలిజెన్స్ బ్యూరోకు కూడా అంతు చిక్కని ప్రశ్న. కానీ ఈ హత్య ఓ కెమెరా కంటికి చిక్కింది. ఆ కెమెరా ఆ హత్యను లైవ్‌లో చిత్రీకరించింది. చివరకు ఆ లైవే హంతకుడ్ని పట్టించింది.

    ఆ కథాంశంతో తమిళంలో రూపొందిన చిత్రం వామనన్. జర్నీ ఫేమ్ జై, లక్ష్మీరాయ్, ప్రియా ఆనంద్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రధారులు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని లైవ్ పేరుతో తెలుగులోకి అనువదించారు. నిర్మాత ఎస్ రాజేష్, దర్శుకుడు అహమ్మద్.

    చిత్ర సమర్పకుడు ప్రవీణ్ నేలపాటి మాట్లాడుతూ - "ఇందులో హీరో జై పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది. లక్ష్మీరాయ్ మోడల్‌గా కనిపిస్తారు. టీవీ చానెల్ కెమెరా‌మన్‌గా సంతానం నవ్వులు పూయిస్తారు. ఇటీవలే విడుదలై ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది" అన్నారు.

    యువన్ శంకర్ రాజా శ్రావ్యమైన స్వరాలందించారని, ఇందులో ఎంబిఎ విద్యార్థి పవన్ గాయకునిగా పరిచయమయ్యాడని ఆయన చెప్పారు. పవన్ పాడిన "ఓ ప్రేమ దేవతా.." అనే పాట యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. "ఇందులోని ప్రతి ఒక్క సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ నెలాఖరునగానీ, వచ్చే నెల తొవివారంలో గానీ సినిమాను విడుదల చేస్తాం" అని ప్రవీణ్ నేలపాటి వివరించారు.

    రఘు, సంపత్ రాజ్, ఊర్వశి, రోహిణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ కృష్ణ, ఎడిటింగ్: ముత్యాల నాని, మాటలు: విజయ్, పాటలు: గురుచరణ్, విజయ్ దేవర, సాహిత్య సాగర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్రామిరెడ్డి పమ్మి, విజయ్ పెదిరెడ్ల.

    English summary
    Tamil movie Vamanan all set release in Telugu as Live. Lakshmi Rai, Jai and Priya Anand starred Live is based on a murder.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X