చీటింగ్ కేసులో... సెక్సీ ఆంటీ
సెక్సీ లుక్స్‌తో వెండి తెరపై వ్యాంపు క్యారెక్టర్లు, టీవీ సీరియల్స్ లో విలన్ వేషాలు వేస్తూ రాణిస్తున్న నటి భువనేశ్వరి చీటింగ్ కేసులో బుక్కయింది. భువనేశ్వరి చెన్నయ్ కి చెందిన ఓ ఫైనాన్సియర్ దగ్గర టీవీ సీరియల్ తీస్తానని రూ. 1.5 కోట్లు తీసుకుంది. సీరియల్ తీయక పోగా, డబ్బులు తిరిగి ఇవ్వడానికి మొరాయిస్తుండటంతో సదరు ఫైనాన్సియర్ చెన్నయ్ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
భువనేశ్వరి గతంలో వ్యబిచారం కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. కళాకారుల పరువు తీసే చర్చ చేసినందుకు ఆమెపై కొన్ని సినీ పరిశ్రమల్లో నిషేదం కూడా విధించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా భువనేశ్వరి చీటింగ్ కేసులో ఇరుక్కోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











