క్రేజీ గెటప్స్‌లో మహేష్‌... మహర్షిలో ఆ పాత్రను సీక్రెట్‌గా.. రజనీని మించిన ప్రిన్స్

Recommended Video

Interesting Update On Mahesh Babu's Maharshi Movie || Filmibeat Telugu

సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి టీజర్ ఇంటర్నెట్‌లో ధమాకా సృష్టిస్తున్నది. ఉగాది రోజున రిలీజైన ఈ చిత్రం రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధిస్తూ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు గెటప్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. క్లాసీ, మాస్ లుక్స్‌తో మహేష్ చేస్తున్న హంగామా మహర్షిపై ట్రేడ్ వర్గాల్లో మరింత ఆశలు పెంచుతున్నాయి. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

 మూడు విభిన్నమైన కోణాల్లో మహేష్

మూడు విభిన్నమైన కోణాల్లో మహేష్

మహర్షి చిత్రంలో మహేష్ బాబు పాత్రను మూడు విభిన్నమైన కోణాల్లో దర్శకుడు వంశీ పైడిపల్లి తీర్చి దిద్దినట్టు కనిపిస్తున్నది. బిజినెస్ మ్యాన్‌గా, అన్యాయాన్ని ఎదురించడానికి రౌడీలను చితక్కొట్టే యువకుడిగా, సమాజ మార్పు కోరే మహర్షిగా మూడు అవతారాలు టీజర్లో దర్శనమిచ్చాయి. దీంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి.

టైమ్ పిరియడ్‌ను బట్టి వేర్వేరు పాత్రల్లో

టైమ్ పిరియడ్‌ను బట్టి వేర్వేరు పాత్రల్లో

జాతీయ మీడియాకు చెందిన ఓ వెబ్‌సైట్‌తో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. మూడు వేర్వేరు సమయాల్లో మూడు విభిన్నమైన పాత్రల్లో మహేష్ బాబు పాత్ర కనిపిస్తుంది. ఓ టైమ్ పీరియడ్‌లో పూజా హెగ్డే, అల్లరి నరేష్, రిషికుమార్ మధ్య స్నేహం చుట్టూ కథ తిరుగుతుంది అని అన్నారు. ఈ చిత్రంలో కీలకంగా కనిపించే డాన్ పాత్రను యూనిట్ గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.

రజనీకాంత్‌ రికార్డు బ్రేక్

ఇక మహర్షి టీజర్ విషయానికి వస్తే.. దక్షిణాదిలో రికార్డుస్థాయి వ్యూస్‌ను సాధించింది. 12 గంటల్లో రజనీకాంత్ పేటా సాధించిన 9.1 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. 24 గంటల్లో ఈ టీజర్ 13 మిలియన్లకుపైగా వ్యూస్‌ను సాధించింది. టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే.. సినిమా ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో స్పష్టమవుతున్నది.

ఉత్తరాది ప్రేక్షకులకు చేరువగా

ఉత్తరాది ప్రేక్షకులకు చేరువగా

తెలుగు తెరకే పరిమితం అయిన మహేష్‌బాబుకు దేశవ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఆయన నటించిన చిత్రాలు హిదీ భాషలోకి డబ్బింగ్ అయి ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకొంటున్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై, పంజాబ్‌తోపాటు, ఇంటర్నేషనల్ ఆడియెన్స్ భారీగా ఉన్నారు. మహేష్ కు ఉన్న క్రేజ్‌ను బట్టి మహర్షి చిత్రాన్ని ఉత్తరాదిలో విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X