వర్మ ముంబైలో అప్పులు పాలయ్యే ఈ పనులు
రామ్ గోపాల్ వర్మ ముంబైలో అప్పులపాలయ్యాడు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకే రక్త చరిత్ర, బెజవాడ రౌడీలు అనే టైటిల్స్‌ను ఎంచుకుంటున్నాడు అంటూ దుయ్యబట్టారు టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వంశీ. రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటించిన టైటిల్ బెజవాడ రౌడీలు అంతటా హాట్ టాపిక్ గా మారింది. టీవీ ఛానెల్స్ అంతా ఈ విషయమై పోగ్రామ్ లు, లైవ్ లు చేసి మరింత పబ్లిసిటీ చేసాయి. ఈ నేపధ్యంలో విజయవాడ నుంచి వంశీ ఇలా ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..వర్మని గతంలోనే రక్తచరిత్రపై ఒకసారి హెచ్చరించాం. అయినప్పటికీ మారకుండా ఇపుడు బెజవాడ రౌడీలు టైటిల్ ను ఎంచుకున్నారు. డబ్బు సంపాదన కోసం ఇలాంటి పేర్లు పెట్టకూడదు. ఇప్పటికైనా వర్మ టైటిల్ పేరును మార్చుకోవాలి అన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ..తాను ఎవరు కోసం టైటిల్ మార్చకోవాల్సిన పనిలేదని సమాధానిమిచ్చారు.
రామ్ గోపాల్ వర్మ వంశీ బెజవాడ రౌడీలు రక్త చరిత్ర ముంబై ram gopal varma vamsi appalaraju bezawada rowdy rakta charitra


Click it and Unblock the Notifications