'గోపి గోపిక గోదావరి' ఎలా ఉంది?

By Staff

వేణు, కమలినీ ముఖర్జీ జంటగా ప్రముఖ దర్శకుడు వంశీ రూపొందించిన చిత్రం 'గోపి గోపిక గోదావరి' చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది. అయితే ఊహించినంత గొప్పగా లేదని అంతటా టాక్ వినపడుతోంది. కథ ప్రకారం గోపిక (కమిలినీ ముఖర్జీ) గోదావరిలో 'ఫార్ కార్నర్స్ హాస్పిటల్' పేరుతో మొబైల్ హాస్పటిల్ ని నడుపుతూంటుంది.ఆమెకు గోపి(వేణు) అనే సింగర్ తో సెల్ ప్రేమ నడుస్తు ఉంటుంది. అయితే ఔను వాళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం లో లాగా ఇద్దరు ఒకరని ఒకరు చూసుకోరు.అలా ఫోను సంభాషణల్లోనే గోపి-గోపిక ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడతారు. ఇద్దరూ కలుసుకోవాలని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య ఎదురవుతుంటుంది. శ్యామ్ కు గోపికను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న ఆమె తల్లికి (జయలలిత) గోపి-గోపికల ప్రేమ వ్యవహారం తెలుస్తుంది. ఎలా ఉంటాడో తెలియని గోపిని ముందు తాను చూసిన తర్వాతే పెళ్లికి ఒప్పుకుంటానని తల్లి తేల్చిచెబుతుంది. దాంతో గోపికను కలుసుకునేందుకు గోపి పోలవరం బయలుదేరుతాడు. అయితే దారిలో కొందరు గోపి తలపై బలంగా కొట్టి గోదావరిలో పడేస్తారు.

అలాదెబ్బలు తగిలి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి వచ్చిన వేణుకి కమిలిని చికిత్స చేసి వైద్యం చేస్తుంది. అయితే అతను ఈ ప్రమాదంలో తన జ్ఞాపక శక్తిని కోల్పోయి ఉంటాడు. ఆ తర్వాత అతను కమిలినీతో ప్రేమలో పడతాడు. దాంతో తన పేరు గోపి అని చెప్పడు.అలాంటి పరిస్థితిలో వారిద్దరూ ఎలా కలిసారు అన్నది మిగతా కథ.ఇక వంశి ఎప్పటిలాగే తనదైన మార్క్ కామెడి కి జోక్స్ ని కలిపి వండే ప్రయత్నం చేసాడు. కమిలిని కాస్త లావైన బాగానే ఉంది. వేణు మాత్రం బాగా డల్ గా కనిపించాడు. కృష్ణభగవాన్-సన-కొండలవలస మధ్య వచ్చే కామెడీ వల్గర్ గా ఉన్నా ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అవకాసం ఉంది. ఇక చక్రి అందించిన సాంగ్స్ ఇప్పటికే పాపులర్ అయ్యాయి. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా', 'కనివిని ఎరుగని పరణయమిది' పాటలు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ తెచ్చుకుంటున్నాయి. లోకి పి.గౌడ్ కెమెరా వర్క్ బాగుంది. పడాల శివ సుబ్రమణ్యం మాటలు కొన్ని చోట్ల బాగా పేలాయి. ఎన్ని ఉన్నా సినిమా టోటల్ గా నీరసంగా ఉందని వంశి అభిమానులే కామెంట్ చేయటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X