twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు వంశీ 'మన్యంరాణి'

    By Srikanya
    |

    ప్రముఖ దర్శకుడు వంశీ రాసిన 'మన్యంరాణి'నవలను విడుదల చేసారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ...'బాపుగారు ఈ నవలకు అద్భుతమైన బొమ్మలు గీశారు. ఒకరకంగా చెప్పాలంటే.. బాపు బొమ్మల కోసం నేను పుస్తకం వేశాను. ఇంతకు ముందు ఇలా వేయలేదు. ఇకముందు వేయలేను అని బాపుగారు చెప్పడమే... ఈ నవలకు దక్కిన కితాబు. ఈ నవలను సినిమాగా తీయడానికి ప్రయత్నించను. కేవలం చదువుకోవడానికే వేశాను. గతంలో 'పసలపూడి కథలు' రాశాను. మా వూరు ప్రాధాన్యతతో కూడిన ఆ కథలకు ఎంతో పేరు వచ్చింది. ఇప్పుడు ఈ నవల రాయడానికి రంపచోడవరం ఆ చుట్టుపక్కల పలు ప్రాంతాలను పర్యటించాను. మారుమూల ప్రాంతాలను కూడా తిరిగాను. ఆ అడవి చూస్తుంటే..మన్యంరాణి స్పురించింది. చక్కటి పదాలతో నవలను తీర్చిదిద్దాను' అని చెప్పారు.

    గతంలో ఆయన ఓ పత్రికలో రాసిన 'మన్యంరాణి' కథను నవలగా ముద్రించారు. సోమవారంనాడు హైదరాబాద్‌లోని మాటీవీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నవలను విడుదల చేసి, మా టీవీ డైరెక్టర్‌ రామకృష్ణకు అంకితమిచ్చారు. ఇక రామకృష్ణ మాట్లాడుతూ...'స్వాతి పుస్తకంలో ఈకథను చదివాను. ప్రకృతి జీవన విధానం మానవునిలో ఎలా మిళితమైందే బహుచక్కగా వంశీగారు ఆవిష్కరించారు' అని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం వంశీ ..లేడీస్ టైలర్ సీక్వెల్ ని రవితేజ తో ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ అనే టైటిల్ తో ఈ చిత్రం రానుంది.

    English summary
    Telugu Director Vamsi's latest novel titled Manyam Rani launched by Maa TV Director Rama Krishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X