వంశీ కొత్త చిత్రం మిస్డ్ కాల్
దర్శకుడు, కథా రచయిత వంశీ ఒక వెరైటీ సినిమా తీయనున్నారు. ఆ సినిమా పేరు మిస్డ్ కాల్. సెల్‌ఫోన్లు వచ్చాక మిస్డ్ కాల్స్‌కు ఎక్కడలేని ప్రాధాన్యం వచ్చింది. యాభై రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ కార్డు వేసుకోవడం, ఎంత పెద్ద వాడికైనా ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం, అవతలి వ్యక్తి కాల్ చేశాడో సుత్తి కొట్టేయడం సినిమారంగంలోనే కాదు మిగతా రంగాల్లోనూ ఉంది. ఈ థీమ్‌ని సృజనాత్మక దర్శకుడు వంశీ వెరైటీగా మలచనున్నారు. ఆయన ఆ మధ్య శివాజీ-అర్చనలతో కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను సినిమాకు దర్శకత్వం వహించారు. మిస్డ్ కాల్‌లో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించనున్నాడు. ఇళయరాజా సంగీతం సమకూర్చనున్నారు. వంశీ-ఇళయరాజాల కాంబినేషన్‌లో గతంలో అనేక హిట్ చిత్రాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications