ఎన్టీఆర్‌తో కత్తి పట్టించాల్సిందే...వంశీ పైడిపల్లి
జూ ఎన్టీఆర్ సినిమా అంటే కత్తి పట్టక తప్పదు అంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన బృందావనం చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం ప్రస్దావించారు. అయితే దానికి రీజన్ ఉందన్నారు. ఆ రీజన్ వివరిస్తూ....మాస్ ఇమేజ్ ఉన్న ఒక పెద్ద హీరో ఎన్టీఆర్. అలాంటప్పుడు ఫ్యామిలీ సబ్జెక్టుతో వస్తున్నాం..ఇలాంటి ప్రయత్నం ఫలిస్తుందా...అనే భయం ఎక్కడో ఉంది. అయితే నేనో సాహసం చేస్తున్నానని మాత్రం ఎప్పుడూ అనిపించలేదు. కథ వినగానే ఎన్టీఆర్ ఓ విషయం చెప్పారు-'వంశీ ఇందులో నేను కొత్తగా కనిపించాలి. అభిమానులను దృష్టిలో ఉంచుకో' అన్నారు. ఆయన మాట కూడా నిజమే. ఫ్యాన్స్ కోణంలోనూ ఆలోచించాలి. అందుకు తగ్గ అన్ని అంశాల్నీ ఇందులో మేళవించాం. కథపైనా, మా బృందంపైనా ఎన్టీఆర్ ఎంతో నమ్మకం ఉంచారు. ఆ నమ్మకమే ఈ రోజు విజయాన్నిచ్చింది అన్నారు. కాజల్,సమంత హీరోయిన్స్ గా దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం వారం క్రిందట రిలీజైంది.


Click it and Unblock the Notifications











