twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సినిమా ఇష్యూ... పివిపి కేసును న్యాయంగా ఎదుర్కొంటానన్న వంశీ!

    టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన పివిపితో దర్శకుడు వంశీ పైడిపల్లి వివాదం కేసులు పెట్టుకునే వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా వంశీ పైడిపల్లి స్పందించారు. పీవీపీ ఆరోపణల్లో నిజం లేదని, ఊపిరి సినిమాక

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన పివిపితో దర్శకుడు వంశీ పైడిపల్లి వివాదం కేసులు పెట్టుకునే వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా వంశీ పైడిపల్లి స్పందించారు. పీవీపీ ఆరోపణల్లో నిజం లేదని, ఊపిరి సినిమాకు నష్టపోయానని పీవీపీ చెబుతున్న మాటలు అవాస్తమని చెప్పాడు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని వంశీ తెలిపారు.

    'ఊపిరి' తర్వాత తనతో మరో సినిమా చేసేందుకు వంశీతో ఒప్పందం కుదుర్చుకొన్నాననీ, ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆయన వేరొక నిర్మాతతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని నిర్మాతల మండలికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రసాద్‌ వి.పొట్లూరి.

    ఈ సినిమా విషయంలోనే ప్రసాద్‌ వి.పొట్లూరి తమిళనాడు హైకోర్టుని కూడా సంప్రదించారు. పివిపి సంస్థ అభ్యర్థన మేరకు చెన్నయ్ హైకోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చేసింది. పివిపి సంస్థ మహేష్ బాబుతో నిర్మించాల్సిన సినిమా కోసం తయారుచేసిన కథను, ఆ దర్శకుడు వంశీ పైడిపల్లి, రచయితలు హరికృష్ణ, ఎ సోలమన్ లు మరే విధంగానూ వాడకూడదని ఆ ఇంజక్షన్ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కోన్నట్లు తెలుస్తోంది.

    Vamsi Paidipally

    వంశీ పైడిపల్లి తదుపరి సినిమా తన సంస్థలో తీయకపోతే 'వూపిరి' చిత్రానికి వచ్చిన నష్టం మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ ఆరోపణలపై వంశీ స్పందించారు. పీవీపీ ఆరోపణల్లో నిజం లేదని, ఊపిరి సినిమాకు నష్టపోయానని పీవీపీ చెబుతున్న మాటలు అవాస్తమని చెప్పాడు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని వంశీ తెలిపారు.

    ఓ వైపు పిపివి అలా ఫిర్యాదు చేయడం... మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. మ‌హేష్ బాబు ఈ బ్యాన‌ర్ లో చేసిన బ్ర‌హ్మోత్స‌వం సినిమా ప్లాప్ అవ్వ‌డంతో పివిపికి మ‌రో సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చారు. గ‌త కొన్ని రోజులుగా వంశీ పైడిప‌ల్లి పివిపి ఆఫీస్ లో ఉంటూ మ‌హేష్ కోసం స్ర్కిప్ట్ రెడీ చేసారు. మ‌రి...ఏమైందో ఏమో కానీ...వంశీ పైడిప‌ల్లి నిర్మాత‌ పివిపి మార్చేసి.... అశ్వినీదత్-దిల్ రాజులతో కలిసి మ‌హేష్ 25వ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను.

    English summary
    Vamsi Paidipally about PVP case. Vamshi Paidipally, the director of "Oopiri" and "Yevadu", has landed in a big trouble. Producer Prasad V Potluri filed a complainant at Producer's Council seeking action against director Vamshi Paidipally for breaching the contract with him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X