మహేష్ తో సినిమాపై వంశీ పైడిపల్లి ట్వీట్

By Srikanya

మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా ఖరారైందంటూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వంశీ పైడిపల్లి ఈ విషయమై వివరణ ఇస్తూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో...మహేష్ తో నా ప్రాజెక్టు ఫైనలైజ్ కాలేదు. చర్చలు జరుగుతున్నాయి అని ట్విట్టర్ లో రాసారు. ప్రస్తు వంశీ పైడిపల్లి తన ఎవడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దాదాపు యాభై శాతం వరకూ ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ అయ్యింది.

ఎవరు చిత్రం విషయానికి వస్తే..శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.

ఇక మహేష్ విషయానికి వస్తే..ఆయన తన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో బిజీగా ఉన్నారు.'సింపుల్‌ అండ్‌ బ్యూటిఫుల్‌'చిత్రం ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్‌, మహేష్‌బాబు హీరోలుగా చేస్తున్నారు. సమంత,అంజలి, జయసుధ, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రధారులు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ తీర్చిదిద్దిన ప్రత్యేక సెట్‌లో ప్రధాన తారాగణంపై కుటుంబ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...విరగబూసిన సిరిమల్లె చెట్టుని ఆ పూట సీతమ్మకి అంకితం చేశారు. కొమ్మ కదలకుండా పూలు కోశారు. కోసిన పూలన్నీ వాలుజడకి చుట్టారు. సీతమ్మ సింగారం వెనక అసలు కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు దిల్‌ రాజు. అలాగే తెలుగుదనం ఉట్టిపడే కథ ఇది. మన ఇంట్లో జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అన్నదమ్ములుగా ఇద్దరు కథానాయకులు ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది. ఇంటర్నెట్‌లో ఆ పాట బిట్‌ చాలామంది వీక్షిస్తున్నారు అన్నారు. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X