»   » ఆస్ట్రేలియా కథతో మహేష్‌కు ఎలాంటి సంబంధం లేదు..అంతా ట్రాష్!

ఆస్ట్రేలియా కథతో మహేష్‌కు ఎలాంటి సంబంధం లేదు..అంతా ట్రాష్!

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ కు 2018 పండగే అని చెప్పొచ్చు. వరుస చిత్రాలతో మహేష్ ఈ ఏడాది బిజీకాబోతున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కోటికి పైగా వ్యూస్ తో భరత్ అనే నేను టీజర్ దూసుకుపోతోంది. ఈ చిత్రం తరువాత మహేష్ బాబు వంశీ పైడి పల్లి దర్శకత్వంలో సినిమా ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రం గురించి ఇటీవల కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని దర్శకుడు వంశి పైడి పల్లి తేల్చేశాడు.

జోరుమీదున్న సూపర్ స్టార్

జోరుమీదున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీమంతుడు వంటి ఘన విజయాన్ని మహేష్ కు అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.భరత్ అనే నేను చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.

 తొలిసారి ముఖ్యమంత్రిగా

తొలిసారి ముఖ్యమంత్రిగా

మహేష్ బాబు ఈ చిత్రంలో తొలిసారి ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా అలరించబోతున్నాడు. టీజర్ లో మహేష్ లుక్స్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ ఏడాది మరో చిత్రం

ఈ ఏడాది మరో చిత్రం

భరత్ అనే నేను చిత్రం పూర్తి కాగానే మహేష్ మరో చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. చాలా రోజుల క్రితం మహేష్ వంశీ పైడిపల్లికి కమిట్ మెంట్ ఇచ్చాడు. భరత్ అనే నేను చిత్రం తరువాత వంశి పైడిపల్లి దర్శకత్వంలోని చిత్రం మొదలవుతుంది.

ఆస్ట్రేలియా కథ

ఆస్ట్రేలియా కథ

ఈ చిత్రంపై సోషల్ మీడియాలో కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. వంశి పైడిపల్లి మహేష్ బాబు చిత్రాన్ని ఓ ఆస్ట్రేలియా వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వంశి పైడిపల్లి చివరగా తెరకెక్కించిన చిత్రం ఊపిరి ఓ ఫ్రెంచ్ మూవీ ఆధారంగా రూపొందించింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఊపిరి చిత్రానికి వంశి పైడిపల్లి ప్రశంసలు అందుకున్నారు.

రూమర్స్ కి చెక్

రూమర్స్ కి చెక్

దీనిపై వంశీ పైడిపల్లి తాజగా సోషల్ మీడియాలో స్పదించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. మహేష్ 25 వ చిత్రానికి వేరే ఏ కథతో సంబంధం లేదని తేల్చేసాడు.

English summary
Vamsi Paidipally clears all air on Mahesh movie. This movie not inspired by any story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu