వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్!

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పివిపి సినిమా బేనర్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 తర్వాత ఈచిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పవర్ స్టార్ సినిమాకు పని చేసే అవకాశం రావడంతో వంశీ పైడిపల్లి సర్‌ప్రైజ్ అయినట్లు టాక్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్ సమర్పణలో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత నటిస్తున్నారు.

'గబ్బర్ సింగ్' లాంటి భారీ విజయం సాధించిన సినిమా తర్వాత వస్తున్న మూవీ కావడం, 'జల్సా' లాంటి సూపర్ హిట్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడంతో 'అత్తారింటికి దారేది' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కూడా అందుకు తగిన విధంగానే ఉంటుందని అంటున్నారు.

మరో వైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన 'ఎవడు' చిత్రం ఆగస్టు 21న విడుదలకు సిద్ధం అవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X