twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో దర్శకుడు వంశీ ఫైడిపల్లి ఫిర్యాదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''నేను ఫేస్‌బుక్‌లో పలు అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్‌ చేస్తున్నానంటూ గత రెండు వారాల నుంచి ఫోన్‌కాల్స్‌, సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. ఈ మధ్య ఓ హీరోయిన్‌ ఫోన్‌చేసి 'మీరు నాతో అలా చాటింగ్‌ చేస్తారనుకోలేద'ని చెప్పింది. అలాగే మరో అమ్మాయి ఫోన్‌ చేసి ఫొటోషూట్‌ చేస్తానన్నారు కదా డబ్బులు ఎంత పంపాలని అడిగింది'' అంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి వాపోయారు.

    ఎవరో అదృశ్య వ్యక్తి ఆయన పేరుతో ఫేస్‌బుక్‌లో రెండు, ట్విట్టర్‌లో ఒక ఐడీ సృష్టించి తప్పుడు సమాచారాన్ని రాస్తున్నట్లు సైబర్ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఇలా స్పందించారు. దర్శకుడు వంశీ పైడిపల్లి పేరు మీద ఒక వ్యక్తి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఎకౌంట్ ఓపెన్ చేశాడు. వాటిలో వంశీకి సంబంధించిన సమగ్ర సమాచారాల్ని ఇవ్వడంతో చాలామంది ఆ ఎకౌంట్స్‌ని ఫాలో అవుతున్నారు.

    ''సమాజంలో ఓ హోదాలో ఉన్న వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లలో వాళ్ల పేర్లతో ఖాతాలు తెరిచి అభ్యంతరకర సమాచారం రాయడం సరైంది కాదు. ఇప్పటివరకూ నాకసలు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఖాతాయే లేదు. అలాంటివి నేను ఎలా చేస్తానని చెప్పాను. నా పేరుతో ఖాతా సృష్టించిన వ్యక్తిని ఇదంతా ఎందుకు చేస్తున్నావని సదరు సైట్ల ద్వారానే అడిగితే అశ్లీలమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ వ్యాఖ్యలు పోస్ట్‌ చేస్తున్నాడు. నాకూ, కొంతమందికి మాత్రమే తెలిసిన వ్యక్తిగత విషయాలను కూడా అందులో ఉంచుతుంటే... ఇదేదో నాకు దగ్గరగా ఉండే వ్యక్తులే చేస్తున్నట్లు సందేహం కలుగుతోంది. త్వరలోనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను'' అన్నారు.

    ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా తను దర్శకత్వం వహిస్తున్న 'ఎవడు' చిత్రం గురించి వంశీ చెబుతూ - ''ఈ చిత్రం ఫస్టాఫ్ పూర్తయ్యింది. ఈ నెలలోనే అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ పాల్గొనగా సీన్స్ తీస్తాం. మార్చిలో పాటలను, ఏప్రిల్ లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం'' అన్నారు.

    English summary
    "I am shocked seeing these posts in my name. It is disgusting. So I filed a case with the Cyber Police Department," Vamsi Paidipalli said. He has approached Cyber Polices to stop the fake profiles on his name, which have been posting malicious write-ups.Vamsi Paidipalli, director of Brindavanam, is not on any social networking websites. Speaking to reporters, he said that he does not have an account either on Twitter or Facebook.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X