ఆయ్... మాది పసలపూడి..ఇది మరో ప్రయోగం
"ఇటీవలే ఓ పత్రికలో ఆయ్.. మాది రాజమండ్రి అనే చిత్రం చేస్తున్నాను అని రాశారు. అది సరికాదు. ఆ సినిమా పేరు ఆయ్... మాది పసలపూడి" అంటూ వివరణ ఇచ్చారు వంశీ. ఆయన దర్శకత్వంలో ఆయ్..మాది రాజమండ్రి అండీ అనే టైటిల్ తో చిత్రం రాబోతోందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పక్కా కోనసీమ శ్లాంగ్ తో ఉండే టైటిల్ ని పెట్టనున్నారని ఆయన అబిమానులు ఆనందించారు. అయితే ఆయన ఆ టైటిల్ తప్పని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన స్వస్థలం పసలపూడి పేరుతోనే ఓ చిత్రం చేయబోతున్నారు. వంశీ మాట్లాడుతూ నరేష్ చిత్రం తరవాత ఇది మొదలవుతుంది.
అలాగే ఆయన స్వాతి పత్రిక లో 'మా పసలపూడి కథలు'రాసి కథా రచయితగానూ పాఠకుల్ని విశేషంగా మెప్పించారు. వాటినన్నిటినీ 'మా పసలపూడి కథలు' అనే టైటిల్ తో ఆడియో బుక్‌గా విడుదల చేయబోతున్నానని చెప్పుకొచ్చారు. ఈ కథల్ని సునీల్, కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, సునీత, ఝాన్సీ తదితరులు చదువుతారు. ఇటువంటి ఎక్సపరిమెంట్ తెలుగులో ఇంతకుముందు జరగలేదు. దాంతో మంచి ఆసక్తి ఏర్పడే అవకాశం ఉంది. చదువురానివారికి,వచ్చినా పుస్తక పఠనం ఆసక్తి లేనివారికి,బధిరితులుకు ఈ ప్రయోగం ద్వారా పశలపూడి కథలు పరిచయమవుతాయి. మొత్తానికి ఈ రకంగానూ ఆయన మరో కొత్త ప్రయోగానికి తెర తీయనున్నారన్నమాట. ఈ ప్రయోగం విజయవంతం అయితే మరిన్ని మంచి రచనలు ఇలాగే ఆడియో రూపంలో వస్తాయనటంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











