వంశీతో కోరిక తీరింది, నిర్మాత హ్యాపీ
తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ దర్శకుల్లో 'వంశీ' ఒకరు. మంచు పల్లకి, సితార, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపిక గోదారి లాంటి ఎంటర్టెనైర్లను అందించారు. తాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ కలిగిన వంశీ తాజాగా ఓ చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇటీవల ఐస్ క్రీం, ఐస్ క్రీం 2 చిత్రాలను నిర్మించిన భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి సత్యనారాయణ, వంశీతో కలిసి పని చేయబోతున్నారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 'వంశీ గారితో ఓ సినిమా నిర్మించాలన్నది నా చిరకాల కోరిక. అది నెరవేరుతున్నందుకు నాకు కలుగుతున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అన్నారు.
ఓ ప్రముఖ యువ కథానాయకుడు నటించనున్న ఈచిత్రం అతి త్వరలో సెట్స్ మీదనకు వెల్లనుందన, పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని తుమ్మలపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రాజెక్టు ఓకే అయిన సందర్భంగా వంశీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నిర్మాత తుమ్మలపల్లి సత్యానారాయణ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











