Pushpa Deleted Scene: రష్మిక ప్రైవేటు పార్ట్‌పై బన్నీ చేయి.. సుకుమార్ దృష్టికి వెళ్లడంతో అలా!

గత ఏడాది వచ్చిన 'అల.. వైకుంఠపురములో' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేశాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

అయితే, ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా మధ్య జరిగిన ఓ సన్నివేశంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీన్ని సినిమా నుంచి డిలీట్ చేశారని తెలిసింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

‘పుష్ప'గా ఎంట్రీ ఇచ్చిన ఐకాన్ స్టార్

‘పుష్ప'గా ఎంట్రీ ఇచ్చిన ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు.

అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ స్థాయిలో

అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ స్థాయిలో

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 145 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 3000 వేలకు పైగానే థియేటర్లలో విడుదలైంది.

పాజిటివ్ రివ్యూలు.. సూపర్ హిట్ టాక్

పాజిటివ్ రివ్యూలు.. సూపర్ హిట్ టాక్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పుష్ప' మూవీ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో' అని అంటున్నారు. అలాగే, రివ్యూలూ పాజిటివ్‌గా వచ్చాయి.

కలెక్షన్లు కూడా.. ఆల్‌టైం రికార్డులతో

కలెక్షన్లు కూడా.. ఆల్‌టైం రికార్డులతో

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులతో పాటు సినీ ప్రియుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో ఆల్‌టైం రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇక, శనివారం కూడా అదే రీతిలో వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

ఆ ఒక్క సీన్‌పై విమర్శలు రావడంతో

ఆ ఒక్క సీన్‌పై విమర్శలు రావడంతో

'పుష్ప' మూవీ ఆద్యంతం ఆకట్టుకునే ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. అలాగే, ఇందులో అన్ని వర్గాల వాళ్లకూ నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. అయితే, ఒకే ఒక్క సీన్ మాత్రం విమర్శలకు తావిచ్చింది. ఈ విషయం దర్శకుడు సుకుమార్ దృష్టికి కూడా వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు ఆ సన్నివేశాన్ని తొలగించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది.

ప్రైవేట్ పార్ట్‌పై చేయి.. ఆ సీన్ డిలీట్

ప్రైవేట్ పార్ట్‌పై చేయి.. ఆ సీన్ డిలీట్

'పుష్ప' సినిమాలో ఒక సందర్భంలో అల్లు అర్జున్.. రష్మిక మందన్నా మధ్య వ్యాన్‌లో ఓ సన్నివేశం జరుగుతుంది. అందులో హీరో, హీరోయిన్ ప్రైవేటు పార్టుపై చేయి వేసి కూర్చుంటాడు. ఆమె చేయి తీయమని పలుమార్లు చెప్పినా.. డైవర్ట్ చేస్తూ అలాగే ఉంచుతాడు. ఇప్పుడీ సీన్ మీదే విమర్శలు వచ్చాయి. ఇది సుకుమార్ మార్క్ కాదని, వెగటుగా ఉందని కామెంట్లు వెల్లువెత్తాయి.

ఆదివారం నుంచి అది లేకుండానే

ఆదివారం నుంచి అది లేకుండానే

'పుష్ప' మూవీలోని వ్యాన్ సీన్‌ హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో ఈ సన్నివేశాన్ని తొలగించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే శనివారం దీన్ని ఎడిటింగ్ చేసేశారు. దీంతో ఆదివారం నుంచి ఈ సీన్ లేకుండానే సినిమాను ప్రదర్శించబోతున్నారు. అయితే, ఇది అన్ని భాషల్లోనూ కట్ చేస్తారా? లేక తెలుగుకే పరిమితం చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X