వాన సంగీతం కాపీయా???
ఎంస్ రాజు తొలిసారి దర్శకునిగా నిర్మించిన సినిమా వాన. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదల అయింది. వానకు సంగీతం కమలాకర్ అందించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే వివాదం మొదలయింది.
వాన సినిమాను కన్నడంలో సూపర్ హిట్ అయిన ముంగారు మలే సినిమాకు రీమేక్. కన్నడంలో సూపర్ హిట్ అయిన ముంగారు మలే సినిమాకు సంగీతాన్ని అందించింది మనోమూర్తి. వివాదం కూడా ఇక్కడే మొదలయింది. మనోమూర్తి సంగీతాన్ని తెలుగులోకి ఆయన అనుమతి లేకుండా కాపీ కొట్టినట్టు ఆరోపణ. అనుమతి తీసుకున్నారా లేదా అన్నది నిర్మాత కమ్ దర్శకుడు ఎంఎస్ రాజు కే తెలియాలి కానీ మనోమూర్తి మాత్రం దీనిని సీరియస్ గా పరిగనిస్తున్నట్టు సమాచారం. అనిసుతిదే పాట ట్యూన్ ను ఉన్నది ఉన్నట్టుగా తెలుగులోకి కాపీ కొట్టినట్టు తెలుగులో విన్నవారు సైతం నిజమేనని చెబుతున్నారు.
ఇది ఇలా ఉంటే కాపీ కొట్టడం కొత్తేంకాదుగా అని కొందరు అంటున్నారు. స్వాతిముత్యం సినిమాను కన్నడంలోకి రీమేక్ చేసినపుడు కన్నడ స్వాతిముత్యానికి సంగీతాన్ని అందించిన రాజేష్ రామనాథన్ ఇళయరాజా సంగీతాన్ని ఉన్నదిఉన్నట్టు కాపీ కొట్టాడని కనీసం ఇళయ రాజా పేరును కూడా ఎక్కడా పేర్కొనలేదని విమర్శకులు అంటున్నారు. మొత్తానికి వాన సంగీతం సినిమా విడుదలకు ముందే విమర్శల జడిలో తడుస్తోంది.


Click it and Unblock the Notifications











