మత్తెక్కిస్తున్న చరణ్-తమన్నా వానపాట పోస్టర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-తమన్న జంటగా 'రచ్చ' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. పరాస్ జైన్, ఎన్వీ ప్రసాద్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ 'వాన వాన వెల్లువాయే' పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ సాంగుకు సంబంధించిన పోస్టర్ తాజాగా బయటకు విడుదల చేశారు. ఈ స్టిల్ చూసిన అభిమానులు తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా చరణ్ అదర గొడుతున్నారని, పోస్టర్ చాలా సెక్సీగా రొమాంటిక్ గా ఉందంటున్నారు.
గతంలో మగధీర చిత్రంలో కూడా చిరంజీవి సూపర్ హిట్ పాట 'బంగారు కోడి పెట్ట' పాటను రీమిక్స్ చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా వాన వాన వెల్లువాయే పాట కూడా రచ్చ సినిమాకు మంచి అసెట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఆడియో ఈ నెల 11న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోకు ఛీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ ఉడ్ బి ఉపాసన రానుందని సమాచారం. ఏప్రిల్ లేదా మే నెలలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











