పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వనపర్తి కోర్టు సమన్లు
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోదరుడు సినీ హీరో పవన్‌కళ్యాణ్‌ను మార్చి 7వ తేదీలోగా మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి కోర్టులో హాజరు కావాలని జుడిషియల్ ఫస్ట్ క్లాసు మెజిస్ట్రేట్ జయప్రసాద్ సోమవారం అదేశాలు జారీ చేశారు. 2008 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో పవన్‌కళ్యాణ్ కాంగ్రెస్ నాయకులను పంచలు ఊడదీసి తంతానంటూ విమర్శించాడు. వనపర్తి పట్టణ కాంగ్రెస్ ప్రధా న కార్యదర్శి, న్యాయవాది కిరణ్‌కుమార్ అదే నెల 31 వనపర్తి కోర్టులో పవన్‌పై పరువునష్ట దావా వేశాడు. దీనిపై కోర్టు పవన్ కళ్యాణ్‌కు సమన్లు జారీ చేసింది.


Click it and Unblock the Notifications











