ఆ హీరోని బద్మాష్ అని ఎందుకనాలంటే...వందేమాతరం శ్రీనివాస్
హీరోని బద్మాష్ అని ఇంతవరకూ ఎవరూ అనలేదు. మేం ఎందుకన్నామన్నది ఆసక్తికరం. ఆద్యంతం కామెడీగా ఉంటుంది. కాలేజీ నేపథ్యంలో సాగుతుంది అంటున్నారు వందేమాతరం శ్రీనివాస్. ఆయన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సిద్దార్ధ కాలేజీస్ జి.నాగయ్య నిర్మిస్తున్నారు. నాగ సిద్ధార్థ్, ఏక్తా ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ..."దర్శకుడిగా నా తొలి చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. పాటలన్నీ కొత్తగా వినిపిస్తున్నాయని విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ నెల మూడోవారంలోగానీ, నాలుగోవారంలో గానీ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇక నిర్మాత జి.నాగయ్య మాట్లాడుతూ.."వందేమాతరం చాలా చక్కగా తెరకెక్కించారు. తెలుగు తెరమీద చూడని వినూత్న కథ ఇది. ఒక సారి చూసిన వాళ్ళకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ఇది అని అన్నారు. జి.పి. సిద్ధార్థ ఫిల్మ్ అకాడమీ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'బద్మాష్'. చంద్రమోహన్, సుమన్, ధర్మవరపు, బాబూమోహన్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, భగత్, గాయత్రి కీలక పాత్రధారులు. కథ: పి.వి.గిరి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: చంద్రబోస్, అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: డా.వి.మహాలక్ష్మి


Click it and Unblock the Notifications











